Sarkaru Vaari Paata Event: ఈ సినిమాలో మా అబ్బాయి కూడా నటించాడు.. లీక్ చేసిన సుధీర్ బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. థమన్ అందించిన పాటలు కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది హైదరాబాద్ యూసఫ్ గూడా లో జరిగిన ఈ వేడుకకు పలువురు దర్శకుడు సుకుమార్, సుధీర్ బాబు, అశోక్ గల్లా అలాగే పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇక మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా, సుధీర్ బాబు కూడా ఈ సినిమా ఈవెంట్ లో వారి మాటలతో ఆకట్టుకున్నారు.

అశోక్ గల్లా..
అశోక్ గల్లా మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్పెషల్ థాంక్స్.. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరికీ నచ్చేసింది. పాటలు ట్రైలర్లు చూస్తే అర్థం అయిపోయింది ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చెప్పవచ్చు. ఇక మన సూపర్ స్టార్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతోంది. ఇక ఇప్పుడు వచ్చే సినిమా మామూలుగా ఉండదు అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. దర్శకుడు పరశురామ్ సార్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నారు అని అర్ధమైపోయింది.

బెస్ట్ టీమ్
సినిమాకు పని చేసిన టీమ్ లో అందరూ బెస్ట్ టెక్నీషియన్స్. థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఎంతో బాగా నచ్చేసింది. కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకు బెస్ట్ హీరోయిన్. ఇలాంటివి బెస్ట్ ఆర్టిస్టులు ఉండడం వలన సినిమా రిజల్ట్ కూడా బెస్ట్ అనేలా ఉంటుంది. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏమిటంటే ఇప్పటి వరకు మా మామయ్య ఒక సూపర్ స్టార్ అని నేను ఫీలింగ్ లో ఉన్నాను. కానీ ఇప్పుడు అర్థం అయింది.. అంతకంటే మీకు ఒక మించి సూపర్ స్టార్ అని తెలిసింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని కోరుకుంటున్నాను అని అశోక్ గల్లా తెలియజేశారు.

నాకు ఎప్పుడూ ఒక ప్రాబ్లం
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు. ఒక సూపర్ హిట్ సినిమా ఫంక్షన్ లాగా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క పాటకు కూడా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. నాకు ఎప్పుడూ ఒక ప్రాబ్లం ఉంటుంది మహేష్ గురించి నేను మాట్లాడలేదు అంటే మీకు నచ్చదు. మహేష్ గురించి మాట్లాడితే మహేష్ కు నచ్చదు అలా నేను మధ్యలో ఇరుక్కుపోతే ఉంటాను.. అని అన్నారు.

కాంట్రవర్షియల్ అయ్యేలా ఉంది
ఇది కొంత కాంట్రవర్షియల్ అయ్యేలా ఉంది కానీ నేను మాట్లాడతాను. వింటేజ్ మహేష్ బ్యాక్ అని అంటే.. నేను అయితే ఆ స్టేట్మెంట్ కు ఒప్పుకోను. ఎందుకంటే మహేష్ బాబు ఎలాంటి పాత్రలోనైనా ఎప్పటికీ ఒకే తరహాలో న్యాయం చేయగలరు అని నేను బలంగా చెప్పగలను. అలాగే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అని అన్నారు.

100 కోట్ల షేర్ పక్కా
కానీ మహేష్ విషయానికి వస్తే పాన్ ఆడియన్స్ అనే పదాన్ని వాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వర్గాల వారు మహేష్ బాబు సినిమా కోసం ఒకే తరహాలో ఎగ్జైట్ అవుతారు. ఆయనకు క్లాస్ మాస్ అనే తేడా లేదు. ఈ సినిమా 100 కోట్ల షేర్ నుంచి మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. వడ్డీ తో కాదు చక్రవర్తి తో సహా లాగేస్తుంది అని నేను అనుకుంటున్నాను.

మా అబ్బాయి దర్శన్ యాక్ట్ చేశాడు
అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సినిమాలో మా అబ్బాయి దర్శన్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. చిన్నప్పుడు మహేష్ లాగా అతను కనిపించాడు. ఈ విషయం అతను నటించే వరకు మహేష్ నమ్రతకు ఎవరికీ తెలియదు. నెపోటీజమ్ అని కూడా ఎవరు మాట్లాడకూడదు. అతనిలో తప్పకుండా కృష్ణ గారిని చూస్తారు అని నేను బలంగా చెబుతున్నాను.. అని సుధీర్ బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











