Sarkaru Vaari Paata థియేటర్‌లో దద్దరిల్లడం ఖాయం.. మహేష్ గురించి సుకుమార్ ఎమోషనల్
మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో వైభవంగా జరుగుతున్నది. వేలాది మంది అభిమానుల సమక్షంలో జరుగుతున్నది. ఈ వేడుకలో దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో కీర్తీ సురేష్, మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా మ.. మ మహేశా పాటను రిలీజ్ చేశారు.
అనంతరం సుకుమార్ మాట్లాడుతూ.. అదృష్ణవశాత్తూ మ.. మ.. మహేశా పాటను చూశాను. అలాంటి పాటను నా చేతుల మీదుగా విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి థియేటర్‌లో ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఫీలింగ్‌తో ఉన్నాను. ఈ పాట థియేటర్‌లో దద్దరిల్లిపోతుంది. బుజ్జి నాకు మొదటి నుంచి తెలుసు. పరుశురాం డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. గీత గోవింద చూస్తే.. చాలా సెన్సిటివ్‌గా చెప్పే ప్రతిభ స్పష్టంగా కనిపించింది. బుజ్జికి ఆల్ ది బెస్ట్. నిర్మాతలందరూ నాకు బాగా కావాల్సిన వారు అని అన్నారు.

ఇక మహేష్ బాబుతో అనుబంధం గురించి మాట్లాడుతూ సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. 1 నేనొక్కడినే సినిమా షూటింగులో గొప్ప అనుభూతులు ఉన్నాయి. ఆయన నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఆయన షూటింగులో ఉంటే.. దర్శకుడు కింగ్‌లా ఫీల్ అవుతాడు. ఆయన ప్రతీ ఒక్కరికి సపోర్ట్‌గా ఉంటారు. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ను మరిచిపోలేను. మహేష్ బాబుతో కలిసి సినిమా చేయడం చాలా గొప్ప అనుభవం. మైత్రీ మూవీస్ విజయ్ పరంపరలో ఈ సినిమా కూడా చేరిపోతున్నది. చిత్ర యూనిట్ అందరికి ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications











