Sarkaru Vaari Paata Event: కీర్తి సురేష్ తో హోటల్ దగ్గర థమన్.. తొందరపడి చెప్పడంతో ఆడుకున్న ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. థమన్ అందించిన పాటలు కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది హైదరాబాద్ యూసఫ్ గూడా లో జరిగిన ఈ వేడుకకు పలువురు దర్శకుడు సుకుమార్, సుధీర్ బాబు, అశోక్ గల్లా అలాగే పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇక థమన్ రాగానే యాంకర్ సుమ వేడుకలో కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ ఇబ్బందుల్లో పడేసింది. సుమతో థమన్ తకిట తకిట అంటూ ఒక ప్రత్యేకమైన ప్రశ్నలను కూడా ఆమె అడిగింది. ఇక థమన్ కూడా కొన్ని మాటలు తొందరపడి అనేశాడు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మొదట టైటిల్ అనుకోగానే ట్యూన్స్ కూడా రెడీ అయిపోయాయి అని జూన్లో కథ ఫైనల్ అయినప్పుడు టైటిల్ సాంగ్ కూడా ఒక నెలలో ఓకే చేశారు అని ఆ తర్వాత కళావతి సాంగ్ కూడా తొందరగానే సెట్ అయ్యింది. అంటూ ఇక దర్శకుడు పరశురామ్ అయితే రోజు ఈ సినిమా పాటలను వింటూ ట్రావెల్ అయ్యాడు.. విడుదల చేయకముందే అతను చాలా సార్లు ఈ పాటలను విన్నాడు. ఇక మహేష్ బాబు గారు కూడా కలవతి పాట వినగానే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అప్పుడు కరోనా ఉండడం వలన మొత్తం ఆన్లైన్ లోనే జూమ్ కాల్స్ లోనే ఓకే చేయడం జరిగింది. అలాగే స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా అలానే జరిగాయి.. అన్నారు.
ఇక కళావతి పాట వినగానే ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే కీర్తి సురేష్ మాత్రం ఈ పాటను చాలా లేటు గా విన్నారు. అయితే ఒక సారి ఆమెను నేను హోటల్లో డ్రాప్ చేసి వస్తుండగా ఈ పాటను వినడం జరిగింది అని.. అలా సరదాగా చెప్పడంతో అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా అరిచేశారు. దీంతో అలాంటిదేమీ లేదు అంటూ మళ్లీ థమన్ స్మైల్ ఇచ్చాడు.
క్రికెట్ అంటే ఇష్టం కదా ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని సుమ అడగడంతో తమన్ దర్శకుడు పరశురామ్ వికెట్-కీపర్ అయితే బాగుంటుంది అని కీర్తి సురేష్ మాత్రం బౌలర్ అని అన్నారు. అందరూ ఫ్లాట్ అయిపోతారు అంటూ కీర్తి సురేష్ నటన బ్యూటీ గురించి తెలియజేశాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఫీల్డింగ్ బాధ్యతలను కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని తమన్ తెలియజేశాడు. ఇక ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన ర్యాప్ సాంగ్ కూడా తన గ్రూప్ తో కలిసి థమన్ లైవ్ లోనే పాడడం జరిగింది.


Click it and Unblock the Notifications











