‘సర్కారు వారి పాట’ షూట్ అప్‌డేట్: అవన్నీ క్యాన్సిల్.. చివరికి ఇక్కడే ప్లాన్ చేశారు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాం కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని.. వాటిని కట్టకుండా విదేశాలకు పరారవుతోన్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్న సినిమా ఇది. అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌కు ముందే దీన్ని ప్రకటించినా.. ఈ ఏడాది ప్రారంభంలోనే పట్టాలెక్కించారు. మొదటి షెడ్యూల్‌లో భాగంగా దుబాయ్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ కూడా జరిపారు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో రెండో షెడ్యూల్ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపబోతున్నారట. ఈ నెల మధ్యలో నుంచి ఇది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇందుకోసం శివారు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్‌లు కూడా సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి దీన్ని అమెరికాలో జరపాలని అనుకున్నారు. కానీ, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో దుబాయ్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా కరోనా ప్రభావం విపరీతంగా ఉండడంతో హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఇది 20 రోజులు జరగనుందట.

హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌లో కీలక నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. అలాగే, ఓ పాటను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'ను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











