‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో: మహేశ్ మూవీపై కీర్తీ సురేష్ పోస్ట్

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మహేశ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

బ్యాంకులను మోసం చేస్తూ విదేశాలకు పరారైపోతున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట'ను రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లు జనవరి 25 సోమవారం చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో హీరోయిన్ కీర్తీ సురేష్ కూడా దాన్ని షేర్ చేసింది. 'కొత్త రోజు.. కొత్త జర్నీ.. కొత్త చాప్టర్.. మహేశ్ బాబుతో చేసే ఈ సినిమా కోసం చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నా' అని రాసుకొచ్చింది.

Sarkaru Vaari Paata Shooting Started

'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో జరుగుతోంది. అందుకోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ సహా చిత్ర యూనిట్ ఇటీవలే ఆ దేశానికి చేరుకుంది. ఇక, మొదటి షెడ్యూల్‌లో రెండు సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. దీని తర్వాత హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌లో మిగిలిన నటులపై షూట్ చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత అమెరికాలోనూ మరో షెడ్యూల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అక్కడ క్యాసినో సెంటర్లలో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ తీస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X