Sarkaru vaari Paata Trailer వచ్చేది అప్పుడే.. స్టన్ అయ్యే పోస్టర్ రిలీజ్.. ట్రైలర్ ఎలా ఉంటుందంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాటు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీత గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా ప్రేక్షకులు చాలా రోజులు ఎదురు చూస్తున్నారు. సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలాగే ఎన్ని నిమిషాలు ఉండబోతోంది అనే విషయాలపై కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.

సంతృప్తి పరిచే సినిమా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి అని చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక ఈసారి రాబోయే సర్కారు వారి పాట సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తిపరిచే విధంగా ఉంటుంది అని అర్థమవుతోంది. ఈ సినిమా దర్శకుడు పరశురామ్ కూడా సినిమా చూసిన తర్వాత అభిమానులు అయితే చాలా సంతృప్తి చెందుతారు అని చెప్పాడు. అంతేకాకుండా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఒక ఫుల్ మీల్స్ లా ఉంటుంది అని చెప్పాడు.

విజిల్స్ వేయించేలా
కొన్ని సన్నివేశాలకు ఫ్యాన్స్ చొక్కాలు చించుకునేలా ఉంటాయని కూడా దర్శకుడు వివరణ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫస్టాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు అలాగే ఫన్నీ లవ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అని దర్శకుడు తెలియజేశాడు. ఇక సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విజిల్స్ వేయించేలా ఉంటాయని ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది అని వివరణ ఇచ్చారు.

ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..
కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తుంది అని చెబుతున్నారు. ఇక దర్శకుడు పరశురామ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ను మే 2 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చెప్పాడు. రెండు నిమిషాల నిడివి ఉండే ట్రైలర్ ని రెడీ చేసినట్లు తెలియజేశారు. తప్పకుండా ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని పాటలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయా ట్రైలర్ కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నట్లుగా దర్శకుడు వివరణ ఇచ్చాడు.

మరో యాక్షన్ పోస్టర్
ఇక దర్శకుడు అలా క్లారిటీ ఇచ్చిన కొద్దిసేపటికి చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా మరో పోస్టర్ ద్వారా సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చారు. పోస్టర్ చూస్తుంటే ట్రైలర్ లో మహేష్ బాబు యాక్షన్ సీన్స్ తో కూడా ఆకట్టుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. అలాగే కళావతగా కీర్తి సురేష్ తో కూడా క్యూట్ లవ్ సీన్స్ హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం.

సాంగ్స్ సూపర్ హిట్
ఇక సర్కారు వారి పాట సినిమాను మే 12వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక సంగీత దర్శకుడు తమన్ స్వర పరిచిన పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం విశేషం. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కూడా మంచి క్రేజ్ అందుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి


Click it and Unblock the Notifications











