Sarkaru Vaari Paata US Premiers show talk మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్ మాత్రమే.. సెకండాఫ్‌లో గట్టిగా దెబ్బ..
అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ భారీ అంచనాలతో సర్కారు వారీ పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ ఇచ్చిన హైప్ కారణంగా సినిమాపై మరింత క్రేజ్ లభించింది. సినిమాలోని కళావతి, మ..మ..మ..మహేష్ పాటలు ప్రేక్షకులను సినిమాకు రప్పించేలా చేశాయి. ఇలాంటి అంశాల మధ్య సర్కారు వారీ పాట సినిమా యూఎస్ ప్రీమియర్ల తర్వాత టాక్ ఎలా ఉందంటే?
Recommended Video


సర్కారు వారీ పాట సినిమా కథ..
అమెరికాలో అప్పులు ఇచ్చే ప్రైవేట్ కంపెనీని మహేష్ (మహేష్ బాబు) నడుపుతుంటాడు. కాసినో, జూదానికి బానిసైన కళావతి (కీర్తీ సురేష్) మహేష్ వద్ద లోన్ తీసుకొని పారిపోతుంది. కళావతి నిజస్వరూపం తెలుసుకొన్న మహేష్ ఇండియాకు వచ్చి.. ఆమె తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) నుంచి బాకీ వసూలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఎలాంటి మలుపులు, సంఘటనలు తిరిగాయనేది సినిమా కథ.

ఫ్లాష్ బ్యాక్‌తో కథ మొదలై
మహేష్ బాబు పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్‌తో సర్కారు వారీ పాట మొదలవుతుంది. చిన్నతనంలో అప్పు కారణంగా మహేష్ జీవితంలో విషాదం చోటుచేసుకొంటుంది. అప్పులిచ్చే వ్యాపారంలో మహేష్ బాబు అమెరికాలో సెటిల్ అవుతాడు. జూదం కోసం అప్పు తీసుకొని మహేష్‌ను కీర్తీ సురేష్ ఇబ్బందికి గురిచేస్తుంది. ఇండియాకు వచ్చి తన అప్పును ఎలా వసూలు చేసుకొన్నాడు అనే కథతో మూవీ సాగుంది. ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఇంటెన్స్ సీన్లతో సాగుతుంది.

స్టైలిష్‌గా మహేష్ బాబు
ఫస్టాఫ్‌లో పెన్నీ సాంగ్‌లో మహేష్ బాబు స్టైలిష్‌గా కనిపిస్తాడు. తనదైన శైలిలో డైలాగ్ టైమింగ్‌తో మరోసారి మహేష్ రెచ్చిపోయాడు. కీర్తీ సురేష్ ఎంట్రీ ఫన్నీగా సాగుతుంది. వెన్నెల కిషోర్‌తోపాటు కీర్తీతో మహేష్ లవ్ ట్రాక్ ఫన్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌లోనే కళావతి పాటను పూర్తి చేసేయడంతో ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు సముద్రఖని, మహేష్ బాబు మధ్య సీన్లు ఫవర్‌ఫుల్‌గా ఉంటాయి.

ఫస్టాఫ్ వినోదంతో..
ఎంటర్‌టైనింగ్ ప్రధానంగా సర్కారు వారీ పాట ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో మాస్ ఫైట్ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తుంది. మా మా మహేశా పాట వీర మాస్‌తో తెర మీద రచ్చ చేస్తుంది. ప్రేక్షకుడికి పైసా వసూలు మాదిరిగా ఉంటుంది. క్లైమాక్స్ ముందు మరో మాస్ ఫైట్, ఎమోషనల్ సన్నివేశాలతో కథ ముగుస్తుంది.

మహేష్ ఒక్కడి వల్లే
సర్కారు వారీ పాట సినిమాలో మహేష్ బాబు సినిమాను ఒక్కడే తన భుజాల మీద మోశాడు. ఫస్టాఫ్ వినోదంగా సాగింది. మూడు పాటలు సినిమాలో బాగున్నాయి. సెకండాఫ్ విషయానికి వస్తే.. కథ ఆకట్టుకొన్నట్టు కనిపించదు. కథనం నీరసంగా ఉంటుంది. బ్యాంక్ కుంభకోణాలపై మహేష్ డైలాగ్స్ కాస్త శృతిమించాయనే విషయం కనిపిస్తుంది. మహేశ్ ఒక్కడి వల్లే ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











