Sarkaru Vaari paata ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. అక్కడ ప్రదర్శనలు లేవంటూ అధికారిక ప్రకటన

మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట మూవీ అనేక వాయిదాల తర్వాత భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మే 12వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్లు ఒకరోజు ముందుగానే అంటే.. మే 11వ తేదీన ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు షాకింగ్ లాంటి న్యూస్‌ను మైత్రీ మూవీస్ తెరపైకి తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

సర్కారు వారీ పాట సినిమాను అత్యాధునిక సాంకేతికతతో ప్రదర్శించాలని అభిమానులు, ప్రేక్షకుల డిమాండ్ చేస్తున్నారు. అయితే అమెరికాలో XD, RPX, సోని డీసీ స్క్రీన్లలో ప్రదర్శించడానికి ఇప్పుడు అడ్డంకులు ఏర్పడటంతో అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఓపికగా ఎదురు చూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అని ప్రకటనలో తెలిపారు.

Sarkaru Vaari paata will not screening at XD, RPX, Sony DC Theatres due to Doctor Strange release

సర్కారు వారీ పాట సినిమాను XD, RPX, సోని డీసీ స్క్రీన్లలో ప్రదర్శించాలని రిక్వెస్ట్‌లు వచ్చాయి. అయితే వాటిలో ప్రదర్శించడానికి వీలు కావడం లేదు. ఆ థియేటర్లు అందుబాటులో లేవు. ఈ థియేటర్లు ముందుగానే హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ కోసం బుక్ అయ్యాయి. దాంతో ప్రాంతీయ చిత్రానికి ఆ థియేటర్లు అందుబాటులో లేవు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం అని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్లు ఫ్లైహై సినిమాస్, శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్, క్లాసిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే మెంటల్ మాస్ సినిమాను చూసే అభిమానులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. XD, RPX, సోని డీసీ స్క్రీన్లలో ప్రదర్శించే వెసలుబాటు కలిగితే వెంటనే మీకు సమాచారం అందిస్తాం. మీ చూపిస్తున్న ఆదరణ, సపోర్టుకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X