ప్రభాస్ సినిమాలో ఎయిర్‌టెల్ పిల్ల స్పెషల్ రోల్.. ఆశలన్నీ ఆ సినిమా పైనే..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం ఆడియెన్స్ లో అంచనాలను పెంచేస్తున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ప్రభాస్ 20వ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో మరొక గ్లామర్ బ్యూటీగా ఎయిర్‌టెల్ పిల్ల కనిపించనుంది.
ఎయిర్‌టెల్ యాడ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న సాషా చెత్రీ మోడల్ గా మంచి క్రేజ్ అందుకుంది. అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్స్ లో ఆమె ఇచ్చే స్టిల్స్ మామూలుగా ఉండవు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ ఈ బ్యూటీ ప్రభాస్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. పూజా హెగ్డే చెల్లి పాత్రలో చాలా సరదాగా కనిపిస్తుందట. మెయిన్ గా ప్రభాస్ కి ఆమెకి మధ్య వచ్చే సీన్స్ చాలా క్యూట్ గా ఉంటాయని టాక్ వస్తోంది.

ఇదివరకే ఆది సాయి కుమార్ తో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన సాషా ఆ తరువాత పెద్దగా అవకశాలు అందుకోలేదు. నటిగా మంచి క్రేజ్ అందుకోవాలని చూస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆశలన్నీ ప్రభాస్ సినిమాపైనే పెట్టుకుంది. ఇక ఆ సినిమాకి సంబంధించిన స్పెషల్ లుక్ రేపు విడుదల చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











