కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘శశిలలిత’ టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

'లక్ష్మీస్ వీరగ్రంథం' మూవీ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాజాగా జయలలిత జీవిత కథపై కన్నేశారు. త్వరలో 'శశిలలిత' పేరుతో బయోపిక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఎవరికీ తెలియని కోణాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.

'శశిలలిత' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. జయలలిత జీవితంలో ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయని, ఆమె బాల్యం నుంచి, సినీరంగ జీవితం, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు సంఘటనలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలిపారు.

Sasi Lalitha first look, teaser on April 27th

జయలలిత మరణించినపుడు 75 రోజుల పాటు ఆసుపత్రిలో జరిగిన సంఘటనను ఆధారం చేసుకుని సుప్రీం కోర్టులో కేసు వేసింది నేనే... జయలలిత ఒక సంక్షేమ నేతగా తమిళనాడు ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి ఆమె ఆత్మ ఆదేశం మేరకు 'శశిలలిత' అనే సినిమా తన జయం మూవీస్ బేనర్లో నిర్మించబోతున్నట్లు తెలిపారు.

జయలలిత జీవితంలో ప్రజలకు తెలియని యదార్ధ సంఘటనలు ఇందులో చూపించబోతున్నాం. ఆమె బాల్యం, సినీ జీవితం, స్ట్రగులింగ్, శోభన్ బాబుతో లవ్ ఎఫైర్ అన్ని సంఘటనలతో.. చివర్లో 75 రోజులు ఆమె ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయం జనాలకు తెలియజేయడంకోసం ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X