Sasivadane Teaser Review పల్లె అందాలతో శశివదనే.. చిలిపిగా రక్షిత్, కోమలి రొమాన్స్!
పలాస 1978 మూవీతో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్న హీరో రక్షిత్ అట్లూరి. ఆ తర్వాత నరకాసుర చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకొన్నాడు. అయితే యాక్షన్ జోన్ నుంచి రొమాంటిక్ జోన్‌లోకి వచ్చి చేసిన చిత్రం శశివదనే. కోమలి హీరోయిన్‌గా నటించిన చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ వివరాల్లోకి వెళితే..
శశివదనే చిత్రం అచ్చ తెనుగు చిత్రంగా కనిపించింది. అమలాపురం పరిసర ప్రాంతం, కోనసీమ అందాల మధ్య రక్షిత్ శెట్టి, కోమలి మధ్య ప్రేమ కథ ఫీల్‌గుడ్‌గా సాగిందనే విషయం టీజర్ స్పష్టం చేసింది. ఈ సినిమాను 2024 ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించారు.

శశివదనే టీజర్‌లో డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. హీరోయిన్‌తో గడిచే కాలంతో ఈ నేలపై నడిచే నడిచే నా ప్రతీ అడుగు ఇకపై నీతోనే అంటూ హీరో చెప్పిన మాటలు రొమాన్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజెప్పింది. అలాగే ఇన్ని రోజుల పరుగు నా వెంట పడటమే అనుకొన్నా.. కానీ తను వేరే అంటూ హీరోయిన్‌తో చెప్పించిన డైలాగ్స్ సినిమాలోని ఎమోషన్స్‌ను తెలియజెప్పాయి.

రెండు మనసుల మధ్య సంఘర్షణగా రూపొందిన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ శశివదనే సాంకేతిక అంశాలు బలంగా కనిపించాయి. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గొడాల నిర్మించిన ఈ సినిమాకు శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫి పల్లె అందాలను చక్కగా చూపించారనేది టీజర్‌లో కనిపించింది. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ కూడా ఫీల్‌గుడ్‌గా ఉందనిపించింది.
నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలి, రంగస్థలం మహేష్, జబర్దస్త్ బాబీ, ప్రవీణ్ యండమూరి, దీపక్ ప్రిన్స్ తదితరులు
బ్యానర్: ఏజీ ఫిలిం కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్
రచన, దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన
నిర్మాతలు: అహితేజ, అభిలాష్ రెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనుదీప్ దేవ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్


Click it and Unblock the Notifications











