పగతో రగిలిపోయే ఓ తండ్రి కథ.. ఎమెర్జెన్సీ అంటోన్న కట్టప్ప
బాహుబలితో కట్టప్ప గా సత్యరాజ్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కింది. భాషతో, రాష్ట్రాలతో సంబంధం లేకుండా అన్నిచోట్లా సత్యరాజ్‌కు అభిమాన గణం పెరిగింది. బాహుబలి తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌లో విపరీతమైన అవకాశలు పెరిగాయి. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడిగా సత్యరాజ్ పేరు మార్మోగుతోంది. సత్యరాజ్ ఓ సినిమాలో ఉన్నాడంటే.. దానిపై హైప్ ఇట్టే పెరుగుతోంది. ఇప్పుడు ఆ క్రేజ్‌ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో తీరపుగ విర్కపాదం అనే థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ధీరన్ దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. తెలుగులో ఎమర్జెన్సీ అనే టైటిల్‌తో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సీరియస్ లుక్‌లో సత్యరాజ్ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. చైర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ...సీరియస్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు.

ఏ ఫాదర్ రివేంజ్ అని పోస్టర్‌లో రివీల్ చేయడంతో.. ఇదొక ప్రతీకారంతో రగిలిపోయే ఓ తండ్రి కథ అని తెలుస్తోంది. టైటిల్ చూస్తుంటే.. సినిమాపై క్యూరియా సిటీని పెంచుతున్నట్టే కనిపిస్తుంది. ఈ సినిమాకు సత్యరాజ్ ఏకంగా 12 గంటలు డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించారని టాక్. ఈ చిత్రాన్నీ సజీవ్ మీరా సాహెబ్ రాథర్ నిర్మిస్తున్నారు. సమ్మర్ లో సినిమా రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











