దర్శకుడు సతీష్ వేగేశ్న కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ.. శ్రీహరి తనయుడితో
శతమానం భవతి వంటి చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తాను చాటాడు సతీష్ వేగేశ్న. అయితే రెండో ప్రయత్నంగా చేసిన శ్రీనివాస కళ్యాణం మెప్పించలేకపోయింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్‌తో తీసిన ఎంత మంచివాడవురా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకొలేకపోయింది.

తాజాగా తన కుమారుడు సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేస్తూ ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో శ్రీహరి కుమారుడు మేఘాంష్ కూడా మరో హీరోగా నటించబోతోన్నాడు. నేడు శ్రీహరి 56వ బర్త్ డే సందర్భంగా ఈ ప్రకటనను చేశారు. ఈ సినిమాను ఎంఎల్వీ సత్యనారాయణ లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.
స్వర్గీయ శ్రీహరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. అయితే మొదటి చిత్రం సమయంలో సినీ పెద్దలంతా సహకారమందించారు. మొదటి చిత్రం రాజ్‌దూత్‌ను బాగానే ప్రమోట్ చేశారు. కథ, హీరో నటన, అప్పియరెన్స్ ఆకట్టుకొన్నప్పటికీ.. ఎన్నో కారణాలతో రాజ్ దూత్ మెప్పించలేకపోయింది. చాలా రోజులు తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం వేచి చూసిన మేఘాంశ్‌కు సతీష్ వేగేశ్న రూపంలో ఓ అవకాశం వచ్చింది.


Click it and Unblock the Notifications











