మొత్తానికి టాప్ హీరోయిన్ ను సెట్ చేసుకున్న సత్యదేవ్, మిల్కీతో రొమాన్స్..

మొదటి సినిమాలోనే ఛార్మీ కౌర్ వంటి సీనియర్ హీరోయిన్ తో స్టెప్పులేసిన సత్యదేవ్, ఆ తరువాత టాప్ రేంజ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసిన దాఖలాలు లేవు. ఆఫ్ బీట్ సినిమాలతో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సెల్ఫ్ మేడ్ స్టార్, మెయిన్ స్ట్రీమ్ లోకి అడుగుపెట్టే రోజులు వచ్చేశాయని తెలుస్తోంది.

పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతున్న సత్యదేవ్, ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టెయిల్ తెలుగు రీమేక్ లో వీళిద్దరి జంట జనాలను కనువిందు చేయబోతోందని తెలుస్తోంది.

Satya Dev finally hits a bulls eye... All set to Romance Avanthika

దర్శక నిర్మాత నాగశేఖర్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ ఏడాది జనవరీలోనే విడుదలైన ఈ చిత్రం, కన్నడనాట బాక్సాఫీస్ ఓ ఊపు ఊపేసిందట. ఇక తెలుగు రీమేక్ సెప్టెంబర్ లో పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూర్చనుండగా, సత్య సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సత్యదేవ్ తమన్నా, సినిమాలో మిలానా, కృష్ణ పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. సత్యదేవ్ ప్రస్తుతం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో కనిపించనున్నాడు. మరోవైపు తమన్నా సీటీమార్ అనే తెలుగు చిత్రంలోనూ, బేలే చూడియాఁ అనే హిందీ చిత్రంలోనూ కనువిందు చేయనుంది. మరి వీరిద్దరి జంట ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X