డబ్బు ఉంటేనే విలువ.. హత్యలు, దోపిడిలతో పనిలేదు.. ట్రెండీగా బ్లఫ్ మాస్టర్ ట్రైలర్!

చట్టంలోని లోసుగులు, మనుషుల బలహీనతలను క్యాష్ చేసుకొంటూ డబ్బు సంపాదించడమనే కాన్సెప్ట్‌తో బ్లఫ్ మాస్టర్ రూపొందింది. తమిళంలో ఘనవిజయం సాధించిన శతురంగ వెట్టై చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో జ్యోతిలక్ష్మీ ఫేమ్ సత్యదేవ్, హీరోయిన్ నందితా శ్వేత జంటగా నటించారు. అభిషేక్ బ్యానర్‌పై రమేష్ పీ పిళ్లై నిర్మాతగా గోపీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పించారు. రచయిత పులగం చిన్నారాయణ ఈ సినిమాకు మాటలు అందించారు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా డిసెంబర్ 28న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ 8న రిలీజ్ చేశారు.

చట్టంలోని బొక్కల్లో దూరి

చట్టంలోని బొక్కల్లో దూరి

దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువు. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. డబ్బు సంపాదించడానికి హత్యలు, లూటీలు, దోపిడిలు చేయనక్కర్లేదు. చట్టంలో ఉన్న బొక్కల్లో దూరి ఈజీగా సంపాదించవచ్చు అనే సంభాషణలు ఆసక్తిని రేకెత్తించాయి.

డబ్బుతో కొడుతాడు

డబ్బుతో కొడుతాడు

నేను ధనవంతుడిగా బతికాను. పేదవాడిగా బతికాను. అవకాశం వచ్చిన ప్రతీసారి ధనవంతుడిగా బతకాలని అనుకొన్నాను. ధనవంతుడికి కష్టం వస్తే ఏడ్వడు. డబ్బుతోనే కొడుతాడు అలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో బ్లఫ్‌ మాస్టర్ ట్రైలర్ కేక పుట్టించింది.

ఆరో భూతంగా డబ్బు

ఆరో భూతంగా డబ్బు

దునియాలో బతకడానికి నీరు, నిప్పు, నింగి, నేల, గాలితోపాటు డబ్బు కూడా ఆరో భూతంగా మారింది. పంచభూతాలను పిడికిలిలో బంధించి శాసించే స్థాయికి ఎదిగింది. డబ్బు ఎంతైనా కావాల్సిందే అని రచయిత పులగం చిన్నారాయణ, దర్శకుడు గోపి గణేష్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకుడిని ఆలోచింప జేసేలా ఉన్నాయి.

 రీరికార్డింగ్ ఎంగేజింగ్‌గా

రీరికార్డింగ్ ఎంగేజింగ్‌గా

ట్రైలర్‌లో హీరో సత్యదేవ్ చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్, హావభావాలు ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా సునీల్ కశ్యప్ అందించిన రీరికార్డింగ్ చాలా బాగుంది. ఎంగేజింగ్ ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ కాగానే నెటిజన్ల నుంచి భారీగా కామెంట్లు వస్తున్నాయి.

ఇలా నెటిజన్ల కామెంట్స్

బ్లఫ్ మాస్టర్ సినిమా శతురంగ వెట్టై సినిమాకు రీమేక్. కానీ నటీనటుల ఎంపిక చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పటి వరకు ఒక్క డిస్ లైక్ కూడా లేదు. బ్లఫ్ మాస్టర్ ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని బలంగా నమ్ముతున్నాను అని నెటిజన్లు యూట్యూబ్‌‌లో కామెంట్లు కనిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X