మెగాస్టార్ చిరంజీవితో నటించే ఆఫర్ కొట్టేసిన యువ హీరో.. దివి వద్యా తర్వాత బంపర్ ఆఫర్
ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లూసిఫర్ రీమేక్ చిత్రం అనేక విశేషాలను సంతరించుకొంటున్నది. మలయాళలో భారీ విజయాన్ని లూసిఫర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల చిరంజీవిపై అభిమానాన్ని కురిపిస్తున్న యువ హీరో సత్యదేవ్‌కు లూసిఫర్‌లో కీలక పాత్రను ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ వార్త నేపథ్యంలో చిరంజీవిని సత్యదేవ్ ఇటీవల కలవడం మరింత చర్చనీయాంశమైంది. చిరంజీవిని కలిసిన తర్వాత మీరు లేకుండా 2020కు గుడ్‌బై చెప్పడం అసాధ్యం.. థ్యాంక్యూ అన్నయ్య అని సత్యదేవ్ ట్వీట్ చేశారు.

ఇప్పటికే లూసిఫర్ చిత్రంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివి వద్యాకు ఆఫర్ ఇచ్చినట్టు స్వయంగా బిగ్‌బాస్ ఫినాలే రోజున చిరంజీవి ప్రకటించడం తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం తమన్నా భాటియాతో కలిసి గుర్తుందా శీతాకాలం చిత్రంలో నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications











