twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయ అన్ని భాషల్లో శ్రీమాన్ రామా.. యానిమేషన్ చిత్రంతో సత్య కాశి భార్గవ

    |

    యానిమేషన్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించడం కత్తిమీద సామే. ఇంకా యానిమేషన్ చిత్రాలను ఆదరించే అభిరుచి భారతీయ ప్రేక్షకులకు ఇంకా పూర్తిగా కలుగలేదు. అయినా యానిమేషన్ చిత్రాన్ని రూపొందించి అటు ప్రేక్షకులను ఇటు అవార్డుల గెలుచుకొన్న ఘనత సత్య కాశి భార్గవకు దక్కింది.

    యానిమేషన్ చిత్రంగా రూపొందిన కిట్టూ అనే చిత్రానికి మొట్టమొదటిసారి జాతీయ అవార్డు గెలుచుకొన్న సత్యకాశి భార్గవ మరోసారి యానిమేషన్ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

    ప్రస్తుతం శ్రీ రామ చంద్రుడి బాల్యంలో ముఖ్య ఘట్టాను కథాంశంగా తీసుకొని శ్రీమాన్ రామా అనే చిత్రాన్ని తెరకోక్కించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషలతోపాటు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంతో షూటింగు ముగించి 2021 ఏడాది చివరకు రిలీజ్ చేయాలనే సంకల్సంతో సత్యకాశి భార్గవ ఉన్నారు.

    Satya kashi bhargavas Sriman Rama to release in all Indian languages

    ఈ సందర్భంగా సత్యకాశి భార్గవ మాట్లాడుతూ.. ప్రస్తుత జనరేషన్‌కు పురాణాలపై అవగాహన కల్పించాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. శ్రీ రామ చంద్ర ప్రభువు బాల్యంలోని కీలక ఘట్టాలను యానిమేషన్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందించాలన్నే నా కోరిక అన్నారు. కిట్టూ చిత్రానికి లభించిన ఆదరణే ప్రేక్షకుల నుంచి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

    English summary
    'Kittu' the first National film award winning animated film by Satya kashi bhargava.He is coming again with a an animated feature film on the Childhood of Lord Ram titled Sriman Rama which comes in front of audience at the end of 2021 in hindi, telugu and all indian Languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X