Satya's academy యువ ప్రతిభావంతుల కోసం యాక్టింగ్ స్కూల్.. సినీ ప్రముఖుల చేతుల మీదుగా
టాలీవుడ్‌కు ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసేందుకు నట శిక్షణాలయం సత్యాస్ అకాడమీ ఘనంగా ప్రారంభమైంది. డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకొంటున్న సత్య మాస్టర్ ఈ అకాడమిని ఏర్పాటు చేశారు. మార్చి 13 ఆదివారం ఉదయం సినీ,రాజకీయ మహారధుల సమక్షంలో అమీర్ పేటలోని సారధి స్థూడియోస్ ఎదురుగా ఉన్న సత్యాస్ డి జోన్ ఆవరణలో సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

మార్చి 13 ఆదివారం ఉదయం సినీ,రాజకీయ మహారధుల సమక్షంలో అమీర్ పేటలోని సారధి స్థూడియోస్ ఎదురుగా ఉన్న సత్యాస్ డి జోన్ ఆవరణలో సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా గారు, టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు గారు, సినీ స్టార్ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, నిర్మాత ప్రసన్నకుమార్, హీరో డాక్టర్ రాజశేఖర్, నటి జీవితా రాజశేఖర్ హాజరయ్యారు. యువ ప్రతిభావంతులను సినీ పరిశ్రమలకు అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ అకాడమీని ప్రారంభించిన సత్య మాస్టర్‌ను అభినందించారు. సినీరంగానికి మంచి నటులను పరిచయం చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్, నటులు, దర్శకులు కాశీవిశ్వనాథ్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, స్పందన ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యూల్ రెడ్డి, వీబీజీ రాజు, హీరో కిరణ్, నటులు, అధ్యాపకులు సత్యం యాబి, డాక్టర్ ఎంఎస్ చౌదరి, డైరెక్టర్స్ రాజా వంశీ, సుబ్బు, నాగ్ పొలిమేర, మ్యూజిక్ డైరెక్టర్స్ ఖుద్దూస్, భగవత్, బాలాజీ, చిందేపల్లె గిరిధర్ రెడ్డి, సినీ రైటర్ జలదంకి సుధాకర్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని సత్య మాస్టర్‌ను అభినందించారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సత్యాస్ ఫిల్మ్ అకాడమీ వ్యవస్థాపకులు. సీఈవో CEO సత్య మాస్టర్ మాట్లాడుతూ.. భీమవరంలో పుట్టి అక్కడే విద్యాబ్యాసం చేస్తూ కాలేజ్ ఈవెంట్స్‌లో డ్యాన్స్ చేసే వాడిని. చెన్నైలో సినిమా పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసే తన సోదరుడు సపోర్ట్ ఇచ్చారు. గొప్ప డ్యాన్సర్ అవ్వాలనే కోరికతో విజయవాడలో మస్తాన్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ నేర్చుకొన్నాను. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ముక్కు రాజు మాస్టర్, రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేశాను. టాలెలంట్ ఉండి సరైన శిక్షణ లేక అవకాశం దొరికేది కాదు. ఆ విషయాన్ని గమనించి వారికి సపోర్ట్ ఇవ్వాలని సత్య డి జోన్ డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాను అని సత్య మాస్టర్ అన్నారు.
నా కెరీర్‌లో యాక్టింగ్ నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్లు ఎంతో మంది తారసపడ్డారు. నటనలో సరైన వేదిక, డ్యాన్స్, ఫిట్‌నెస్, ఫైట్స్ లాంటి సదుపాయాలతో ఒకే శిక్షణాలయంలో అందరికి అందుబాటులో ఉండే ఫీజుతో సత్య డి జోన్స్, సత్యాస్ ఫిల్మ్ అకాడమీని ప్రారంభించడం జరిగింది అని అన్నారు.
సత్యాస్ అకాడమీలో ఎంతో అనుభవం ఉన్న నంది అవార్డు గ్రహీతలు, ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్ ద్వారా స్టూడెంట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సత్యాస్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ కోసం సునయన, రామ్మోహన్, డాన్స్‌లో శిక్షణ కోసం తను, తన శిష్యులు ఉంటారు. అలాగే యోగాచార్య హరి సుబ్రహ్మణ్యంతో యోగా, సురేష్ పవార్ చే జుంబా, సునీల్ చే జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఇప్పిస్తాం అని సత్య మాస్టర్ అన్నారు.


Click it and Unblock the Notifications











