twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయ విద్యా వ్యవస్థపై సత్యదేవ్ పోరాటం: ‘గాడ్సే’గా మారేందుకు రెడీ అయ్యాడు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎంతో మంది ఎంట్రీ ఇస్తుంటాడు. వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల మద్దతుతో స్టార్లుగా ఎదుగుతుంటారు. ఈ జాబితాలోకే వస్తాడు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్. కెరీర్ ఆరంభంలోనే సహాయ నటుడిగా పలు చిత్రాల్లో నటించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో మంచి నటనతో ఆకట్టుకోవడంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మాంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరొందాడు. ఈ హీరో భారతీయ విద్యా వ్యవస్థను టార్గెట్ చేస్తున్నాడు.

    గత ఏడాది 'ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య'తో భారీ విజయాన్ని అందుకున్నాడు సత్యదేవ్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ విజయం ఇచ్చిన జోష్‌లోనే అతడు ప్రస్తుతం 'గాడ్సే' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'బ్లఫ్ మాస్టర్' దర్శకుడు గోపీ గణేష్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాను సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మీ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. గురువారమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది.

    Satyadev Fight Agains Indian Study System for Satyadevs GODSE

    ఇక, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వైల్డ్ లుక్‌లో కనిపించిన సత్యదేవ్.. చేతి దగ్గర మందు గ్లాసుతో పాటు వెనకాల పెద్ద గన్ కూడా పెట్టుకుని ఉన్నాడు. దీంతో ఇది మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందే సినిమా అనుకున్నారు. కానీ, భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను వెల్లడించే సందేశాత్మక చిత్రం అని తెలిసింది. అధికారులు చేసిన తప్పిదం వల్ల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న ఓ యువకుడు.. ప్రభుత్వంపై ఎలా పోరాటానికి దిగాడు అన్న కథతో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

    English summary
    Satyadev Kancharana, known professionally as Satya Dev, is an Indian actor who primarily works in Telugu cinema. Starting with supporting roles, Satyadev established himself as a leading actor. He is better known for his performances in the movies such as Jyothi Lakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X