For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో సత్యదేవ్‌పై నమ్మశక్యం కాని వార్త: అతడి విషయంలో చిరంజీవి ఆ నిర్ణయం తీసుకుంటారా!

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పంథాను మార్చుకున్నారు. గతంలో ఒక దాని తర్వాత ఒకటి అలా సినిమాలు చేసిన ఆయన.. ఈ మధ్య మాత్రం వరుసగా పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. నక్సలిజం బ్యాగ్‌డ్రాపుతో సందేశాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా మొత్తం పూర్తైంది. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు.

  చిన్నప్పటి నుంచి అవి చూసే అలవాటు ఉంది: కొత్త హీరోయిన్‌ ముఖం మీదే చెప్పేసిన ఆర్జీవీ

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాల్లో మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' రీమేక్ ఒకటి. మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో తెలుగులో కూడా విడుదలైంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. అలాంటిది దీన్ని ఇప్పుడు చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైంది. అలాగే సెట్ వర్క్ ఈ మధ్యనే మొదలైంది.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో థ్రివినో థామస్ పోషించిన ముఖ్యమంత్రి పాత్రనే అతడు చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో సత్యదేవ్ చేసేది మలయాళంలో వివేక్ ఒబెరాయ్ పోషించిన నెగెటివ్ రోల్ అని తెలిసింది. హీరో సోదరి భర్తగా అతడు ఇందులో కనిపించబోతున్నాడని సమాచారం.

  జాకెట్ తీసేసి బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో: అందాల ఆరబోతలో పట్టా తీసుకుందా ఏంటి!

  Satyadev Kancharana Role Leaked from Chiranjeevis Lucifer

  నిజానికి ఈ సినిమాలో సత్యదేవ్ ఆ పాత్రను చేస్తున్నాడంటే నమ్మశక్యంగా లేదు. దీనికి కారణం.. ఇందులో ఆ పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుంది. కూతురి వరసైన అమ్మాయిని వేధిస్తుంటుంది. ఇలాంటి పాత్రకు సత్యదేవ్ ఎలా ఓకే చెబుతాడన్నది ప్రశ్నర్థాకంగా మారింది. దీంతో ఈ వార్తలో నిజం ఉండే అవకాశాలు లేవన్న టాక్ కూడా వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ విషయంపై ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే సత్యదేవ్ రోల్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక, ఇందులో సత్యదేవ్‌కు ముఖ్యమంత్రి రోల్ కాకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన మాఫియా డాన్ పాత్ర అయినా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరో వార్త వైరల్ అవుతోంది.

  గ్లామర్ షోతో సెగలు రేపుతోన్న అల్లు అర్జున్ ఏంజెల్: అదిరిపోయే ఫోజులతో అదరగొడుతోన్న బ్యూటీ

  ఈ సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారని అంటున్నారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కాబోతుందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi Will do ‘Lucifer’ Remake. Now Young Hero Satyadev Kancharana Role Leaked From This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X