GODSE Movie: గాడ్సే మిషన్ మొదలయ్యేది అప్పుడే.. అదిరే పోస్టర్‌తో ప్రకటన

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ సెన్సేషన్ సత్యదేవ్. కెరీర్ ఆరంభంలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. అంతేకాదు, అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి హీరోగా, సహాయ నటుడిగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచాడు. దీంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

సహజ సిద్ధమైన నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. గత ఏడాది ఆరంభంలో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'తిమ్మరుసు' అనే సినిమాలో నటించాడు. ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'బీర్బల్'‌ అనే మూవీకిది రీమేక్‌గా వచ్చింది. సెకెండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. దీంతో సత్యదేవ్ ఖాతాలో మరో మంచి చిత్రంగా ఇది నిలిచిపోయింది. దీంతో ఆ వెంటనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

 Satyadevs GODSE Movie Release On May 20th

హీరోగా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచీ సరికొత్త కథాంశాలతో సినిమాలు చేస్తున్న సత్యదేవ్.. ప్రస్తుతం 'బ్లఫ్ మాస్టర్' దర్శకుడు గోపీ గణేష్‌తో మరో సినిమా చేస్తున్నాడు. 'గాడ్సే' అనే వివాదాస్పదమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొంత బ్రేక్ రావడంతో ఇంకా షూటింగ్‌ను పూర్తి చేసుకోలేదు. కానీ, ఈ మూవీ నుంచి ఆ మధ్య ఓ పోస్టర్‌ను వదిలారు. దీనికి మంచి స్పందన దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను వదిలారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

సత్యదేవ్ - గోపీ గణేష్ కాంబినేషన్‌లో వస్తున్న 'గాడ్సే' మూవీపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులోనే ఈ మూవీని మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఈ పోస్టర్‌లో సత్యదేవ్ రెండు చేతుల్లో రెండు గన్‌లను పట్టుకుని కనిపిస్తున్నాడు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ పిక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'గాడ్సే' మూవీ ప్రభుత్వంపై పోరాటం చేసే ఒక యువకుడి కథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీజర్‌లో కూడా చూపించారు. ఇక, ఇందులో మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సీన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X