జనసేనాని స్ఫూర్తితో 'సత్యాగ్రహి'.. ఫస్ట్‌లుక్ రిలీజ్
శ్రీ భవిత క్రియేషన్స్ బ్యానర్‌పై గంగారెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం 'సత్యాగ్రహి'. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా నూతన సంవత్సర కానుకగా ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సత్యాగ్రహి.. 'నిజమైన లీడర్ స్ఫూర్తితో' అనే ట్యాగ్ లైన్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో పిడికిలి బిగించిన పవన్ కనిపిస్తుడటం విశేషం.
జనసేనాని పవన్ కళ్యాణ్‌ని స్పూర్తిగా తీసుకొని.. ఆయన సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కోణంలో ఈ సినిమా రూపొందించారు. సమాజంపై యవత బాధ్యతతో ఉండాలని చెబుతూ.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయిన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనే కథాంశాన్ని తీసుకొని ఈ సినిమా తెరకెక్కించారు.

అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇదే 'సత్యాగ్రహి' అనే పేరుతో ఓ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తితో 'సత్యాగ్రహి' చిత్రాన్ని నిర్మిస్తుండటం గమనార్హం. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. చూడాలి మరి ఈ సత్యాగ్రహి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందో!.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. పాటలు: శర్మ, సురేష్ గంగుల, ఎడిటింగ్: శ్రీకాంత్, నిర్మాత :గంగా రెడ్డి, స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్ -డైరెక్షన్: కృష్ణ చైతన్య చేపట్టారు.


Click it and Unblock the Notifications











