twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాంధీ వర్సెస్ గాడ్సే.. సత్యమేవ జయతే 1948 ప్రారంభం

    |

    ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం 'సత్యమేవ జయతే-1948". అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ సికింద్రాబాద్ లోని లీ పాలస్ లో ప్రారంభమైంది.

    ఆలేఖ్య, రఘునందన్ (గాంధీ), ఆర్యవర్ధన్ రాజు (గాడ్సే), నాగినీడు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్), జెన్నీ (మొహ్మద్ ఆలీ జిన్నా), సమ్మెట గాంధీ (అబ్దుల్ గఫార్ ఖాన్), ఇంతియాజ్ (నెహ్రు) శరద్ దద్భావాలా (సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్), పి. శ్రీనివాస్, (అబుల్ కలాం ఆజాద్), తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. శరద్ దద్భావాలా క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు.

    Satyameva Jayate 1948 movie shoot started

    మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని, వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు. 11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పై చిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి, 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రొపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో. 9 షెడ్యూల్స్ లో, ఉన్నత ప్రమాణాలతో.. జాతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను పూర్తి చేయనున్నామని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ తెలిపారు.

    Satyameva Jayate 1948 movie shoot started

    ఈ చిత్రానికి మేకప్: హరి, ప్రొడక్షన్ కంట్రోలర్ : అంజి కోకా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్యప్రకాష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: లక్ష్మీనారాయణ, కెమెరా: కథ- స్క్రీన్ ప్లే- మాటలు: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజు, సంగీతం: 'గులాబీ' ఫేమ్ శశి ప్రీతమ్, నిర్మాత: ఎం.వై..మహర్షి, దర్శకత్వం: ఈశ్వర్ బాబు.డి!!

    English summary
    Satyameva Jayate, a internationa concept movie has been started in Hyderabad.Gandhi's murder back is the main theme. This movie directed by EShwar Babu D. Music By Shashi Preetam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X