నన్ను ఆదరించారు.. నా కొడుకును దీవించండి.. మయోన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సత్యరాజ్ ఎమోషనల్

బాహుబలిలో కట్టప్ప ఫేమ్ సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం మాయోన్. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. మాయోన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7 తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా సినిమా నిర్మాత ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.

రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..మయోన్ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. నేను రాసుకున్న బాహుబలి కథకు కట్టప్ప‌గా నటించిన సత్యరాజ్‌కు నాకు ఎదో రుణానుబంధం ఉంది.మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే మయోన్ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చాక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కొరకు ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు.అందుకే సినిమా బాగా వచ్చింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అలాగే ఈ రోజు లెజెండరీ రచయిత విజేంద్ర ప్రసాద్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విజువల్స్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఓటిటి లో రిలీజ్ చెయ్యమని ఆఫర్ వచ్చినా కాదనకుండా ఆ విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ను థియేటర్స్ లలో ఫుల్ స్క్రీన్‌పై చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు, ఇలాంటి మంచి కథ ఉన్న సినిమా ప్రేక్షకులకు అందరికీ రీచ్ అవ్వాలని నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. శిబిరాజ్ ఈ కథ వినగానే గానే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలలో నటించే అవకాశం అరుదుగా వస్తుందని నటించడానికి ముందుకు వచ్చాడు .ఇందులో నటించిన వారందరూ చాలా డెడికేటెడ్ గా నటించారు. ఇళయరాజా గారితో వర్క్ చేయడం మా అదృష్టం. డీవోపీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారు.

 Satyaraj emotional speech about Sibiraj at maayon movie pre release event

హీరో శిబి సత్యారాజ్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. నాకు విజేంద్ర ప్రసాద్ గారంటే ఎంతో ఇష్టం. మొదటి సారిగా తెలుగులో నేను నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ మయోన్. ఇందులో నేను ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నాను. ఈ నెల 7 న ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని నన్ను ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు

నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే మంచి కంటెంట్ ఉన్న "మయోన్" చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిబి సత్యారాజ్ ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్మాతలు చాలా ఇష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నిర్మాత శ్రీనివాస్..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక,తో పాటు వచ్చిన పెద్దలందిరికి ధన్యవాదాలు. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్‌ వాల్యూస్‌‌తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ మాయోన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్‌ వెర్సస్‌ సైన్స్‌ మెయిన్‌ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు ప్రభాస్ ట్విట్టర్లో ట్వ్వీట్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందు కు చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబందించిన రథ యాత్రను ప్రారంభిస్తున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ను కవర్ చేస్తూ చివరకు తిరుపతిలో దేవుని దగ్గర ఈ రథయాత్రను ముగిస్తున్నాం అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. నటుడుగా సత్యారాజ్ గారు ఇక బ్రాండ్ ను క్రెయేట్ చేసుకున్నాడు. దాని వెనుక అయన కష్టం ఎంతో ఉంది. యావత్తు భారత దేశం తెలుగు సినిమా వైపు చూసేలా కట్టప్ప పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తన కొడుకు శిబి సత్యారాజ్ చేస్తున్న సినిమా కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకుముందు వచ్చిన మైథలాజికల్ సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి.ఇలాంటి కథతో హిట్ అయిన కార్తికేయ సీక్వెల్ గా కూడా రాబోతుంది.శిబిరాజ్ కూడా మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ తండ్రి అంత రేంజ్ కు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శక, నిర్మాతలు ఈ కథపై ఎంతో వర్క్ చేసి కష్టపడి సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఇళయరాజా గారు మ్యూజిక్ చేయడం విశేషం.అలాగే ఇలాంటి హిస్టారికల్ సినిమాలను సపోర్ట్ చేస్తూ అఖండ డి. ఓ. పి రాం ప్రసాద్ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. నిర్మాత మామిడాల శ్రీనివాస్ చాలా పద్దతిగా వెళ్లే మనిషి. మూవీ మాక్స్ ద్వారా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తూ చిన్న సినిమాలను సపోర్ట్ గా నిలబడతాడు. అలాంటి తను నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాను సెలెక్ట్ చేసుకొని ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీ నటులు
సిబిరాజ్, తాన్య రవిచంద్రన్,రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితరులు
దర్శకత్వం: కిషోర్ ఎన్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం
మ్యూజిక్: మాస్ట్రో ఇళయరాజా
డీవోపీ: రాంప్రసాద్
పీఆర్వో : మధు వి. ఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X