సవ్యసాచి కొత్త టీజర్: సుభద్ర పరిణయం.. బలరాముడు అంటే రాముడికి చుట్టమా!
నాగ చైతన్య నటించిన సవ్యసాచి చిత్రం నవంబర్ 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విభిన్నమైన ట్విన్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో ఆసక్తి నెలకొంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్రంలోని సుభద్ర పరిణయం అనే సన్నివేశానికి సంబంధించి టీజర్ విడుదల చేశారు.

టీజర్ హాస్యభరితంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. నాగచైతన్యతో పాటు వెన్నెల కిషోర్, హైపర్ ఆది ఈ టీజర్ లో కనిపిస్తున్నారు. బలరాముడంటే రాముడికి చుట్టమా అని అడగగా.. కృష్ణుడి గెటప్ లో ఉన్న వెన్నెల కిషోర్ స్పందిస్తాడు. సుదర్శన చక్రం సర్వీసింగ్ కి ఇచ్చాను కాబట్టి సరిపోయింది.. లేకుంటే నీకు మూడేది అని వెన్నెల కిషోర్ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది.
సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్ మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చందూ ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. నాగ చైతన్య సరసన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











