సుశాంత్‌ కేసులో సంచలన తీర్పుకు సుప్రీంకోర్టు సిద్ధం! రియాకు ఊరట కలిగేనా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై రియా చక్రవర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదనలు మంగళవారం వాడివేడిగా జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, బీహార్ తరుఫున మనిందర్ సింగ్, రియా తరఫున శ్యామ్ దీవాన్, సుశాంత్ సింగ్ తరుఫున వికాస్ సింగ్ కోర్టు విచారణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.

సీబీఐ దర్యాప్తుపై మాట మార్చడంపై రియా తరుఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు చురకలు, అంటించడం, సుశాంత్‌కు ఫ్యామిలీని దూరం చేయడానికి రియా చేసిన కుట్రలను ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ బయటపెట్టారు. అలాగే ముంబై పోలీసుల దర్యాప్తును సమర్ధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర తరఫున వాదనలు వినిపించారు.

SC reserves order Bihars Sushant Sigh Rajput case trasfer to Mumbai

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుశాంత్ కేసుపై సుప్రీంకోర్టు ఎలాంటి సంచలన తీర్పు వెల్లడిస్తుందనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టింది. ఈ కేసు ఆర్డర్‌ను రిజర్వు చేసింది. దీంతో బీహార్‌లో నమోదైన సుశాంత్ కేసు ఎఫ్ఐఆర్‌ను ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. ఈ కేసులో పార్టీలందరిని రాతపూర్వకంగా పత్రాలను గురువారంలోగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X