AP ప్రభుత్వానికి భయపడి ఆ సన్నివేశాన్ని తొలగించారా? బ్రో మూవీలో ఆ సీన్ పెట్టి ఉంటే వైసీపీ నేతల పరిస్థితి ఏమిటో?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను బ్రో ది అవతార్ (BRO The Avatar) వివాదాలు కుదిపేస్తున్నాయి. బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయనే విషయం అత్యంత వివాదంగా మారింది. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న సీన్ గురించి, ఆ సినిమాను నిర్మించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేయడం వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది.
అయితే ఏపీ రాజకీయాలను డైరెక్ట్ ఎటాక్ చేసే వినోదయ సీతమ్ సినిమాలో ఓ సీన్‌ను బ్రో ది అవతార్‌లో తొలగించారు. ఆ సీన్ ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోననే విషయం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. ఆ సీన్ వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్రో ది అవతార్ సినిమా తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆ చిత్రానికి సముద్రఖని నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. అయితే ఆ చిత్రంలోని క్లైమాక్స్‌లోని ఓ సీన్‌ను తొలగించడం చర్చనీయాంశమైంది. ఆ సీన్‌లో ఏమున్నదంటే..
సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ను ఈ లోకం నుంచి స్వర్గానికి తీసుకెళ్లడంతో సినిమా కథ ముగుస్తుంది. అయితే వినోదయ సీతమ్ రోలింగ్ టైటిల్స్‌లో రాజకీయ నేతలపై భారీ సెటైర్‌తో కూడిన చిన్న బిట్ ప్లే చేస్తారు. ఆ బిట్‌లో ఓ రాజకీయ నేత అక్రమ సంపాదన గురించి షాక్ కలిగించే విషయాలు ఉంటాయి.

వినోదయ సీతమ్ రోలింగ్ టైటిల్స్‌లో.. ఒక రాజకీయ నేత తన అనుచరులతో సంభాషిస్తూ.. నాకు టైమ్ లేదు. తొందరగా చెప్పండి. ముందుగా నేను చెప్పేది వినండి. నా కోసం ఒక గంటలో 100000 మంది వాలంటీర్లు నా పార్టీలో చేరుతున్నారు. నేను ఈ దేశ భవిష్యత్‌ను మార్చేస్తాను. నాకు మంత్రి పదవి వస్తుంది.
నీవు వాళ్లతో మాట్లాడవా? అవి వస్తున్నాయా? మనకు అవి చాలా ఇంపార్టెంట్ అంటూ పక్కనే ఉన్న అనుచరుడిని పిలిచి.. 350 దారిలో ఉన్నాయి. ఒక కంటైనర్ వస్తున్నది. ఫామ్ హౌస్‌లో 40X20 వెడల్పు గోతిని తీయండి. ఆ డబ్బును అందులో పూడ్చి పెట్టి పైన టమాటా తోట వేయండి. ఎవరు కూడా గుర్తు పట్టకూడదు అని రాజకీయ నేత అంటాడు.

రాజకీయ నేత చెప్పిన మాటలు వింటూ.. బాస్.. 21 కోట్ల రూపాయలు ఇప్పటికే భూమిలో పాతి పెట్టాం. వాటి గురించి ఏమిటి అని అనుచరుడు అంటే.. వాటిని ముట్టుకోకు.. వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయాలి. నా వద్ద టైమ్ లేదు. హెడ్ ఆఫీస్ వెళ్లి వస్తాను అంటూ బయలు దేరుతారు. ఆ క్రమంలో మీడియాను కలిసే సమయంలో టైమ్ రూపంలో వచ్చిన సముద్రఖని ఆ రాజకీయ నేతను కౌగిలించుకొంటాడు. దాంతో ఆ రాజకీయ నేత మృత్యువు ఒడిలోకి చేరుకొంటాడు.

అయితే ఎంత డబ్బు ఉన్న టైమ్ వస్తే ఎవడి చావు కూడా ఆగదు. డబ్బును, అధికార బలాన్ని చూసుకొని విర్రవీగడం వద్దు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం దర్శకుడు సముద్రఖని చేశాడు. ఈ సీన్ తెలుగు చిత్రం బ్రో మూవీలో పెట్టి ఉంటే ఏపీలో ఎంత రచ్చ జరిగేదో.. అంబటి రాంబాబు లాంటి సీన్ పెడితే భారీ వివాదానికి దారి తీసిందనే మాట సాధారణ ప్రజల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఈ సినిమాను రాజకీయ వివాదంగా మార్చడం ఇష్టం లేకనే ఈ సీన్ తొలగించినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











