మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. SSMB29 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అప్పుడేనట!
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాతి సినిమా గురించి దేశ వ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని ప్రకటించినప్పటి నుంచి అయితే అందరి కన్ను ఆ సినిమా మీదే పడింది. మొన్నే వెయ్యి కోట్లతో ఈ సినిమాను తీయబోతున్నట్లు చెప్పి షాక్ ఇవ్వగా.. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ రైటర్, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరో అదిరిపోయే వార్తను చెప్పారు. మహేష్ బాబుకు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్ డేట్ ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజమౌళి.. మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలిసిన తర్వాత నుంచి మహేష్ బాబు ఫ్రీ అవ్వగానే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతతున్న గుంటూరు కారం సినిమా ఇటీవలే విడుదల కావడంతో బాబు కాస్త ఫ్రీ అయ్యారు. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన అలా ఫ్రీ అయ్యారో లేదో ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటూ అభిమానులు అంతా అడుగుతున్నారు.

సూపర్ స్టార్ అభిమానుల ఆసక్తిని గుర్తించిన స్క్రిప్ట్ రైటల్ విజయేంద్ర ప్రసాద్ ఓ అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు. మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమా మహేష్ బాబుకు 29వ సినిమా కావడంతో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టగా.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి అయిందని తెలిపారు. మరికొన్ని వారాల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని... వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద సినిమాగా మారబోతుందంటూ వివరించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ కోసమే మహేష్ బాబు యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి మాత్రమే వెళ్లే ఆయన ఈరోజు తొలిసారిగా ఒక్కరే వేరే దేశానికి వెళ్లారు. ఎందుకు వెళ్లారనే దానిపై వాళ్లు అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ విషయం గురించి వెల్లడించారు. మహేష్ బాబు SSMB29 సినిమా వర్క్ షాప్ లో భాగంగా ఓ మూడు నాలుగు రోజులు యూరప్ లోనే ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వార్తల ప్రకారం మరో రెండు నెలల్లో అంటే మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అన్నారు. అవే నిజం కాబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ మాటలు వింటుంటే అర్థం అవుతుంది. పాన్ వరల్డ్ గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతికి నిపుణులను కూడా భాగస్వామం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నచ్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వస్తే అన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











