మళ్ళీ వెనుకడుగు వేసిన బాలయ్య.. సీనియర్ డైరెక్టర్ అప్సెట్!
కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు లాక్ డౌన్ కారణంగా మరో మూడేళ్ళ వరకు బిజీగా ఉండేలా ఒక పక్కా ప్లాన్ అయితే వేసుకున్నారు. మారికొందరేమో తొందరెందుకు అన్నట్లుగా పరిస్థితులను బట్టి అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
BB3 అయిపోయిన తరువాత బాలకృష్ణ ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. నిజానికి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం లేదు. నిర్మాత కూడా రేడిగానే ఉన్నప్పటికీ బాలయ్య పూర్తిగా స్టోరీపై నమ్మకంగా లేరట. అందుకే ఏమైనా మార్పులు చేయలని కోరుతున్నారట.

బి.గోపాల్, రైటర్ సాయి మాధవ్ బుర్రతో కలిసి ఇప్పటికే చాలాసార్లు స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక గోపాల్ ఫైనల్ గా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. అందుకే మరొక సీనియర్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఆ లిస్ట్ లో రాజశేఖర్ ఉన్నాడని సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..


Click it and Unblock the Notifications











