అతనికి అమ్మాయిలంటే తెగ సిగ్గు.. కానీ వాటి గురించి చెప్పి లైన్ లోకి తెచ్చిన సమంత
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా 'ఓ బేబీ'. డిఫెరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత జతగా యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం చిత్రంలోని 'నాలో మైమరపు' అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
'నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా.. ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఇలా' అంటూ సాగిపోతున్న ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. పాటలో సమంత, నాగశౌర్య మధ్య ప్రేమ ముచ్చట్లు హైలైట్ అవుతున్నాయి. ఇక పాట మధ్యలో హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ.. నాగశౌర్యకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నాగశౌర్యకు అమ్మాయిలంటే తెగ సిగ్గని, వాళ్లను చూస్తే 20 అడుగుల దూరంలో నిలిచిపోయేవాడని చెప్పిన నందినీరెడ్డి.. నాగశౌర్యకు కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి సమంత వాటి గురించి చెప్పుకుంటూ మెల్లగా నాగశౌర్యను సీన్లోకి దించేదని ఆ సమయంలోనే తాము షూట్ చేసుకునే వాళ్లమని ఆమె వెల్లడించింది. ఈ పాటలో వారిద్దరూ మాట్లాడుకున్నట్లు కనిపించిన సన్నివేశాల్లో కుక్కల గురించే చర్చ జరిగిందని నందినీరెడ్డి తెలిపింది.

'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. జూలై 5న ఓ బేబీ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై సమతా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తన కెరీర్ లో చేయాలనుకున్న డిఫెరెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానని అంటోంది సమంత.


Click it and Unblock the Notifications











