Pushpa 2: పుష్పగాడి వేలికి ఆడోళ్లు వేసుకునే గోర్ల రంగు... ఇంత లెక్కలేసావా సుకుమార్?
2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంత సెన్సెషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాదు... విదేశాల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతుంది. తాజాగా ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ లో పుష్ప చిటికెన వేలి గోరుకు ఎర్ర రంగు ఉంటుంది. ఇక ఆ రంగు వెనుక సుకుమార్ పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పుష్ప సినిమాకు ధీటుగా ఈ సినిమా ఉండాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది.

అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15, 2024 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సెలవు రోజు, వీకెండ్ కలిసి వస్తుందని మేకర్స్ ప్లాన్ ఆరోజున ప్లాన్ చేశారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో... పుష్ప చేతి వేళ్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఓ పెద్ద కథే ఉందని అంటున్నారు నెటిజన్స్.
పుష్ప 2 సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో చిటికన వేలు గోరును హైలైట్ చేస్తూ చూపించారు. ఇక ఆ పోస్టర్ లో చిటికెన వేలుకు ఉన్న ఎర్ర రంగు వెనుక పెద్ద కథ ఉందని... నెట్టింట టాక్ నడుస్తోంది. అయితే కొన్ని సంస్కృతుల్లో తమ సంపదను, సమాజంలో స్థానాన్ని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారని తెలుస్తోంది.
ఇక కేవలం రూల్ చేయడానికి మాత్రమే తాము ఉన్నట్లు గుర్తుగా చూపించడానికి ఇది సింబలిక్ గా ఉంటుందని టాక్. అయితే ఇదే స్ట్రాటజీతో పుష్పరాజ్ తన ఎర్ర చందనం వ్యాపారాన్ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయడగలడని తెలిపేలా ఈ పోస్టర్ లో దాన్ని హైలైట్ చేశారని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇప్పటికే పుష్ప 2 సినిమా సంచలనం సృష్టించనుందని ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి సైతం చెప్పారు. అల్లు అర్జున్ కెరియర్ కు పదేళ్లు ఎలాంటి డోకా లేదని చెప్పుకువచ్చారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











