రెట్టించిన ఉత్సాహంతో సీరత్ కపూర్.. లాక్‌డౌన్ తర్వాత క్రేజీ ప్రాజెక్టులతో..
యువ అందాల తార సీరత్ కపూర్ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ షూటింగులకు సిద్దమవుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగులకు పూర్తిగా ఆంక్షలు సడలించడంతో చాలా మంది సినీ ప్రముఖులు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఆరు నెలల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో షూటింగులకు కొత్త కళ వచ్చింది. ఈ నేపథ్యంలో సీరత్ కపూర్ కూడా తన షూటింగులకు హాజరుకావడానికి రెడీ అవుతున్నారు.
ఈ సందర్భంగా సీరత్ కపూర్ మాట్లాడుతూ.. షూటింగులు రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదో కొత్త ప్రారంభం అనే ఫీలింగ్ కలుగుతున్నది. మళ్లీ పనుల్లోకి వెళ్లున్నామనే ఫీలింగ్ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ప్రస్తుతం నా ముందుకు వచ్చిన ఇంట్రెస్టింగ్ స్క్రిప్టులను ఫైనల్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాను. త్వరలోనే క్రేజీ ప్రాజెక్టుల వివరాలను తెలియజేస్తాను అని సీరత్ కపూర్ తెలిపారు.

సీరత్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన మా వింత గాధ వినుమా చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. 2014లో జిద్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత టైగర్స్, కోలంబస్, రాజు గారి గది, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటించి మెప్పించింది.



Click it and Unblock the Notifications











