ఫిట్‌గా ఉండాలంటే.. కష్టపడాల్సిందే.. కసిగా సీరత్ కపూర్ వర్కవుట్
లాక్‌డౌన్‌లో ఓటీటీ ద్వారా రిలీజైన కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సీరత్ కపూర్.. మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. మా వింత గాధ వినుమా చిత్రంతో అలరించబోతున్నారు. కెరీర్, క్రమశిక్షణ తప్ప మరో విషయం పట్టని తెలుగు అమ్మాయి పాత్రలో ఆకట్టుకోబోతున్నారు. ఈ పాత్ర కోసం తాను ఎంతో కష్టపడ్డాను. ఫిట్‌గా ఉండటానికి వర్కవుట్లు చేశాను అంటూ సీరత్ కపూర్ పేర్కొన్నారు.
ఇటీవల వర్కవుట్ చేస్తున్న వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా..వైరల్ అయింది. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. ఎంత కష్టమైనా.. బిజీగా ఉన్నప్పటికీ.. తాను వర్కవుట్స్ మానేయను. క్రమం తప్పకుండా ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతాను అంటూ సీరత్ కపూర్ చెప్పారు.

సీరత్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్‌కు ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీలాలో గ్లామర్ పాత్రలో కనిపించింది. ఆమె నటించిన మా వింత గాధ వినుమా చిత్రం త్వరలో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











