For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శత్రువెవరో తెలియకపోతే ప్రతీ క్షణం నరకమే.. రవితేజ చేతుల మీదుగా సీతాయణం టీజర్

  |

  ప్రముఖ కన్నడ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సీతాయణం. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రభాకర్ అరిపాక కాగా, హీరోయిన్‌గా అనహిత భూషణ్ నటిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం తెలుగు టీజర్‌ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు. కన్నడ, తమిళ భాషలకు సంబంధించిన టీజర్‌ను కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ విడుదల చేశారు.

  కామి కానివాడు మోక్షగామి కాలేడు అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్‌లో హీరోయిన్ అనహిత యాక్షన్‌ చెప్పడంతో ఓ ఎమోషనల్‌ సీన్‌లోకి వెళ్లింది. ఈ దారుణాలు బయటకు వస్తే కొన్ని వందల ప్రాణాలు బలైపోతాయి అంటూ టీఎన్నాఆర్ చిన్న ట్విస్టు ఇచ్చారు. ఇక హీరో అక్షిత్ కుమార్.. తనదైన మార్కుతో ఎంట్రీ ఇచ్చి.. తండ్రి ఎవరో తెలియకపోయినా బతకవచ్చు. కానీ శత్రువు ఎవరో తెలియకపోతే ప్రతీ క్షణం నరకమే అంటూ డైలాగ్ చెప్పడం కథలోని ఇంటెన్సీని తెలియజెప్పింది.

  Seethaayanam teaser released by Ravi Teja and Kannada Super Star Shiva Raj Kumar

  సీతాయణం టీజర్‌ను విడుదల చేసిన అనంతరం హీరో రవితేజ మాట్లాడుతూ.. ఫస్ట్‌లుక్, టైటిల్ పోయెటిక్‌గా ఉంటే, మోషన్ పోస్టర్ రొమాంటిక్‌గా ఉంది. టీజర్ చాలా ఆసక్తి కలిగించేలా బయటకొచ్చింది. 'తండ్రి ఎవరో తెలియని అనాథగానైనా బ్రతికేయచ్చు కానీ... శత్రువెవరో తెలియకపోతే ప్రతీ క్షణం నరకమే' అన్న డైలాగ్ సినిమా పై మరింత ఆసక్తి పెంచింది. కథాంశం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా ఉంది. హీరోగా అక్షిత్ శశికుమార్ తండ్రిని మించిన తనయుడు‌గా గుర్తింపు పొందాలి. కన్నడ, తెలుగు, తమిళ భాషలలోమంచి హీరోగా నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

  కరునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీమ్ హీరో, సోదర సమానుడు శశికుమార్ తనయుడు మూడు భాషల్లో ఏకకాలంలో హీరోగా పరిచయం అవ్వడంఅరుదుగా దక్కే గౌరవం. చాలా గొప్ప విషయం. నా చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది .అలాగే సినిమాడెఫినిట్ గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని మూడుభాషల్లో నిర్మిస్తున్న నిర్మాత లలితా రాజ్యలక్ష్మి గారిని అభినందిస్తూ, అన్ని భాషల్లోప్రేక్షకులు ముక్త కంఠంతో మా అక్షిత్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

  దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ.. రెస్పెక్ట్ ఉమెన్ అన్న ట్యాగ్ లైన్‌కి మా"సీతాయణం" చిత్ర కథ పెర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తుంది. మూడు భాషల ప్రేక్షకులకు ఒక విభిన్న అనుభూతిని, ఆసక్తిని కలిగిస్తుంది. నటి నటుల సహకారంతో, మా నిర్మాత లలితా రాజ్యలక్ష్మి ప్రోత్సాహంతో చిత్ర షూటింగ్ ను పూర్తి చేయగలిగాం. అన్ లాక్ ప్రక్రియ అనంతరం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మిగిలిన షూట్ ని పూర్తి చేయగలిగాం. ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి" అన్నారు.

  నిర్మాత లలితా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ "వరుసగా చిత్రాలు నిర్మించాలన్న ఆలోచనకు "సీతాయణం" మరింతగా ఉత్సాహాన్నిస్తుంది. త్వరలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. టీజర్ విడుదల చేసిన మాస్ మహారాజ రవితేజకు, అలాగే కన్నడ, తమిళటీజర్ ను విడుదల చేసిన కరునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ కు కృతజ్ఞతలుతెలుపుకుంటున్నాను" అన్నారు.

  తారాగణం:
  అజయ్ ఘోష్, మధునందన్, విద్యుల్లేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండుసుదర్శన్, అనంత్, జబర్దస్త్ అప్పారావు, టి యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ తదితరులు.
  రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక
  కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
  ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
  సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
  ఫైట్స్: రియల్ సతీష్
  కొరియోగ్రఫీ: అనీష్
  సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
  నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి.

  English summary
  Filming as a Telugu, Kannada bilingual project “Seethaayanam” is directed by Prabhakar Aaripaka starring Anahitha Bhushan opposite him in Rohan Bharadwaj’s presentation & Mrs. Lalitha Rajyalakshmi’s production under Color Clouds Entertainments. This movie teaser released by Mass Maharaja Ravi Teja and Kannada Super Star Shiva Raj Kumar
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X