లవ్ స్టొరీలో రాజీవ్ కనకాల రోల్ వెనుక యాంకర్ సుమ.. ఎంతో భయపడ్డాడు: శేఖర్ కమ్ముల

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొత్తానికి లవ్ స్టోరీ సినిమా విజయం మరికొంత ఆనందాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకోవడంతో మొదటి వారం తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ తో మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ గ్యాప్ లేకుండా కొనసాగుతున్నాయి. ఇక మ్యాజికల్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఈ వేడుకలో రాజీవ్ కనకాల పాత్రపై కూడా శేఖర్ కమ్ముల ఒక క్లారిటీ ఇచ్చారు.

భారీగా ప్రమోషన్స్

భారీగా ప్రమోషన్స్


లవ్ స్టోరీ సినిమా కథ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సెన్సిటివ్ ప్రేమకథా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో నటించిన నాగచైతన్య సాయి పల్లవి మరొకసారి వారి స్టార్ హోదా ను అమాంతం పెంచేసుకున్నారు అనే చెప్పాలి. అంతేకాకుండా విడుదలకు ముందు రెగ్యులర్ ఇంటర్వ్యూలతో కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

రిస్క్ పాత్రలో రాజీవ్ కనకాల

రిస్క్ పాత్రలో రాజీవ్ కనకాల

అయితే సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర అయినటువంటి రాజీవ్ కనకాల చాలా అద్భుతంగా నటించాడు. ఎన్నో నిజజీవిత సంఘటనల ఆధారంగా చేసుకొని శేఖర్ కమ్ముల ఆ పాత్రను డిజైన్ చేసినట్లు కూడా టాక్ వచ్చింది. చిన్న పిల్లలపై తప్పుడు బుద్ధితో కనిపించే పాత్రలో రాజీవ్ కనకాల ఆ పాత్ర చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అనే సందేహం కూడా చాలా మందికి వచ్చింది. నటన పరంగా వెండితెరపై అతని ప్రతిభ చాలానే కనిపించింది. నిజంగా అలాంటి పాత్ర చేయడం పెద్ద రిస్క్ ఇస్తూనే చెప్పాలి.

 ఒప్పుకున్న తరువాత నిద్రలేని రాత్రులు

ఒప్పుకున్న తరువాత నిద్రలేని రాత్రులు


సక్సెస్ మీట్ లో రాజీవ్ కనకాల పాత్ర గురించి కూడా శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు. రాజీవ్ కనకాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి ఆ పాత్ర చేయడానికి ఆయన ఎంతగా బాధపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాడు. ఎంతగానో ఎమోషనల్ అయిపోయేవారు. మాతో కూర్చున్నప్పుడు కూడా తన బాధను చెప్పుకునేవారు. అలాంటి పాత్ర చేయడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. ఒకవిధంగా ఆయన ఇంత పెద్ద ఇష్యూ ని భుజాలపై మూసుకొని అందరికీ తెలిసేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

నా కంటే ఎక్కువ క్రెడిట్ ఆయనకే

నా కంటే ఎక్కువ క్రెడిట్ ఆయనకే

నిజానికి అలాంటి పాత్ర చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పక్కన కూర్చుని అలాగే నాతో కూడా మాట్లాడారు. ఇలాంటి పాత్ర చేసిన తర్వాత జనాలు నన్ను ఎలా చూస్తారో అని అనిపించింది అన్నట్లు మాతో చెప్పిన మాటలు కూడా గుర్తుకున్నాయి. కానీ ఒక యాక్టర్ గా ఆయనకి ఒక మంచి మార్క్ అనే చెప్పాలి. పెద్ద సమస్యను భుజాన వేసుకున్నారు అని చెప్పాలి. ఒక విధంగా నా కంటే ఎక్కువగా కూడా మీకు క్రెడిట్ రావాలి అని అన్నారు.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
ఆ పాత్ర వెనుక సుమ

ఆ పాత్ర వెనుక సుమ

రాజీవ్ కనకాల ఆ పాత్ర చేయడానికి చాలా ధైర్యం చేశారు. అయితే యాంకర్ సుమకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పాత్ర చేయడానికి ఒప్పుకున్న తర్వాత ఆయనకు ఒక విధంగా సపోర్ట్ చేశారు అనే చెప్పాలి. అందుకు సుమకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని శేఖర్ కమ్ముల మాట్లాడారు. ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా సినిమా సక్సెస్ లో ఎంతగానో కీలకం అని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X