twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీడర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ధనుష్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్!

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ దర్శకులు ఉన్నా కూడా శేఖర్ కమ్ములకు ఉన్న స్టార్ డం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆయన ఇలాంటి జానర్ లో సినిమా చేసినా కూడా తనదైన శైలిలో అందరికంటే విబిన్నంగా తెరకెక్కిస్తుంటారు అనేది వాస్తవం. కమ్ముల సినిమాలకు కేవలం క్లాస్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఊర మాస్ అభిమానులు కూడా ఉన్నారు. లవ్ స్టోరీ అంటే నచ్చని వాళ్ళు కూడా శేఖర్ కమ్ముల సినిమాలను చూస్తే ఒక్కసారిగా అభిమానులు అయిపోకుండా ఉండలేరు. ఇక శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది లీడర్ సినిమా గురించే. ఇక ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన కమ్ముల తదుపరి ప్రాజెక్టు పై కూడా ఇంట్రెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు.

    మార్కెట్ పెరిగిపోవడం పక్కా..

    మార్కెట్ పెరిగిపోవడం పక్కా..


    శేఖర్ కమ్ముల అగ్రహీరోలతో సినిమా చేస్తే అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోతాయని మరోసారి అర్థమవుతోంది. ఫిదా అనంతరం మొదటిసారి మరో మీడియం రేంజ్ హీరోతో చేస్తున్న లవ్ స్టోరీ సినిమా పై ఇటీవల ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నాగ చైతన్య మార్కెట్ కూడా ఈ సినిమాతో మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు. లవ్ స్టోరీ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

     లీడర్ లాంటి సినిమా ఎప్పుడు?

    లీడర్ లాంటి సినిమా ఎప్పుడు?

    ఇక లవ్ స్టొరీ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారుతున్నాడు.. అలాగే భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా గా శేఖర్ కమ్ముల నుంచి లీడర్ లాంటి మరో సినిమా ఎప్పుడు చేస్తాడని ఎక్కువ ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఆ విషయం పై కూడా కమల మొదటిసారి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

    ఎక్కడ కలిసినా అదే ప్రశ్న

    ఎక్కడ కలిసినా అదే ప్రశ్న

    రానా దగ్గుబాటి హీరోగా పరిచయమైన లీడర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అభిమానులు అయితే చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది శేఖర్ కమ్ముల ఎక్కడ కలిసిన కూడా లీడర్ 2 సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా శేఖర్ కమ్ముల పలు ఇంటర్వ్యూలలో గుర్తుచేసుకున్నాడు. నా సినిమాల్లో ఎక్కువ మందికి అదే సినిమా నచ్చుతుందని కూడా తెలియజేశారు.

    లీడర్ సీక్వెల్ అతనితోనే..

    లీడర్ సీక్వెల్ అతనితోనే..

    ఇక తప్పకుండా రానా దగ్గుబాటి తోనే లీడర్ సినిమాకు సీక్వెల్ చేస్తానని శేఖర్ కమ్ముల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చాడు. లీడర్ సినిమాలో కులవ్యవస్థకు తో పాటు రాజకీయమంటే అమ్ముడుపోవడం కోనడం అనే పాయింట్ ను ఎక్కువగా హైలెట్ చేశారు. ఇక లీడర్ సీక్వెల్ లో మరి కొన్ని సామాజిక అంశాల్ని కూడా వివరించే అవకాశం ఉందట. మొత్తానికి కమ్ముల లీడర్ పై క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    Recommended Video

    Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
    ధనుష్ సినిమా ఎప్పుడంటే?

    ధనుష్ సినిమా ఎప్పుడంటే?

    ఇక ధనుష్ తో చేయబోయే ట్రిలాంగ్యువల్ సినిమా పై కూడా శేఖర్ కమ్ముల ఒక వివరణ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక ఆ సినిమాను ఈ ఏడాది చివరిలో మొదలుపెడతాను అని శేఖర్ కమ్ముల ఒక అప్ డేట్ అయితే ఇచ్చారు. ఇక సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తానని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నట్లు కూడా తెలియజేశారు.

    English summary
    Sekhar kammula about rana daggubati Leader sequel
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X