అఫీషియల్: నాగచైతన్య- శేఖర్ కమ్ముల మూవీ స్టార్ట్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అక్కినేని నాగచైతన్య, శేఖర్ కమ్ముల కొత్త సినిమా ఆగస్టు 1 వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఈ మేరకు శేఖర్ కమ్ముల, నాగ చైతన్య కలిసి దిగిన పిక్స్ షేర్ చేశారు.

నాగచైతన్య కెరీర్ లో 20 సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో చైతూ సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి చిందులేయనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తిచేసిన శేఖర్ కమ్ముల ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్విరామంగా ఈ చిత్ర షూటింగ్ జరపనున్నారట. ఇటీవలే ఫిదా సినిమాతో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల.. అంతకుమించిన ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నారని సమాచారం.

Sekhar Kammula- Naga Chaitanya Movie Official Statement

శేఖర్ కమ్ములది ముందునుంచే డిఫెరెంట్ వే. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో అలరించడం ఆయనకు మాత్రమే సాటి. తనకు డైరెక్టర్‌గా భారీ ఫెయిత్ వచ్చినప్పటికీ స్టార్‌ హీరోల వెంట పడకుండా తన కథకు ఎవరు బాగుంటారో, వాళ్లనే ఎంచుకుంటూ సినిమాలు రూపొందిస్తుంటారు శేఖర్ కమ్ముల. వీలైనంత వరకూ కొత్త వారికే ఆయన ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో శేఖర్ వద్ద ఉన్న ఓ కథకు నాగచైతన్య, సాయి పల్లవి కరెక్ట్ గా సూట్ అవుతారని భావించిన ఆయన.. వీరితో కొత్త సినిమా రూపొందించేందుకు రెడీ అయ్యారట.

అత్యంత సాధారణంగా సాగే కథలో ఊహించని మలుపులు ఉండేలా చూసుకుంటూ ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేయటం శేఖర్ కమ్ముల స్టైల్. నాచురాలిటీకి పెద్ద పీట వేస్తూ ఆయన సినిమాలు తెరకెక్కుతాయి. అదే కోవలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీని మరింత నాచురల్‌గా చూపించాలని శేఖర్ కమ్ముల ప్లాన్‌లో ఉందట. ఇటీవలే ఫిదా రూపంలో మెగా వారసుడితో జోడీ కట్టిన సాయి పల్లవి.. ఇప్పుడు అక్కినేని వారసుడితో జోడీ కడుతుండటం ఆసక్తికర అంశం. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రాథమిక సమాచారం. మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య 'వెంకీమామ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో రియల్ లైఫ్ మామ విక్టరీ వెంకటేష్‌తో రీల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు చైతూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X