Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
శేఖర్ కమ్ముల చేతిలో మరో స్టార్ హీరో.. ముందు ఎవరితో వర్క్ చేస్తాడో?
డిఫరెంట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలాగే యూత్ ని ఎక్కువగా ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో బిగ్ స్క్రీన్ పై స్పెషల్ మ్యాజిక్ క్రియేట్ చేయగల ఈ దర్శకుడి బాక్సాఫీస్ మార్కెట్ 50కోట్లు దాటినా కూడా ఇంకా స్టార్ హీరోలతో సినిమా చేయడం లేదు. ఫిదా సినిమా తరువాత నాగ చైతన్యతో లవ్ స్టోరీ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. కరోనా అదుపులోకి వస్తే.. వీలైనంత త్వరగా ఆ షూటింగ్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఈ లాక్ డౌన్ లో శేఖర్ కమ్ముల ఇద్దరి హీరోలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా వెంకటేష్ తో ఒక సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరొక హీరో ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
మెగా హీరోలతో కూడా శేఖర్ కమ్ముల రెగ్యులర్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ కి టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం నానితో కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉందని కామెంట్స్ వచ్చాయి. నాగ చైతన్య - సాయి పల్లవి లవ్ స్టోరీ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.