ఓహో ఇలా ప్లాన్ చేశారా.. ఓరేయ్ బుజ్జిగా కోసం రంగంలోకి శేఖర్ మాస్టర్ కొడుకు!!
బుల్లితెరపై, సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ చేసే రచ్చ అందరికీ తెలిసిందే. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరు సంపాదించిన శేఖర్ మాస్టర్.. బుల్లితెరపై సెటైర్లు, పంచ్‌లతో నానా రచ్చ చేస్తుంటాడు. ఇక శేఖర్ మాస్టర్‌తో పాటు అతని కొడుకు విన్ని కూడా బాగానే ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ వేదిక, స్పెషల్ ఈవెంట్లలోనూ విన్ని దుమ్ములేపేస్తాడు. డ్యాన్సుల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమా కోసం విన్ని రంగంలోకి దిగాడు. రాజ్ తరుణ్ హీరోగా అక్టోబర్ 2న ఈ మూవీ ఓటీటీలో ఆహా యాప్‌లో ప్రసారం కాబోతోంది. ఈ మేరకు నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శేఖర్ మాస్టర్ తన కొడుకు విన్నిని రంగంలోకి దించాడు. ఒరేయ్ బుజ్జిగా సినిమాలోని కృష్ణవేణి అనే పాటకు స్టెప్పులు వేశాడు. ఇక ఈ ఛాలెంజ్‌ను

ఈ మేరకు సోషల్ మీడియాలో విన్ని డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఒరేయ్ బుజ్జిగా సినిమాలోని ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అందుకే ఈ ఛాలెంజ్ విసిరేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ప్రేమ్ సాయి దీన్ని రిక్రియేట్ చేయడంలో ఎంతో బాగుంది. నేను ప్రస్తుతం రాజ్ తరుణ్‌కు ఈ ఛాలెంజ్ విసురుతున్నాను. ఇలా మీరు కూడా చేయండి.. లక్కీ విన్నర్స్‌కు ఒరేయ్ బుజ్జిగా టీంతో ముచ్చటించే అవకాశం లభిస్తుందని తెలిపాడు.


Click it and Unblock the Notifications











