స్వీయ నిర్భందం.. ఈ యంగ్ హీరో ఏం చేస్తున్నాడో చూడండి
కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. ఇప్పటికే లక్షల మందికి కరోనా సోకగా.. వేలమందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. భారతదేశంలోనూ శరవేగంగా దూసుకుపోతోన్న కరోనా.. ఇప్పటికి మూడు వందల మందిని కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా ధాటిని తట్టుకోలేక ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎవరికి వారు స్వీయ నిర్భందాన్ని విధించుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశం నేడు (మార్చి 22) జనతా కర్ఫ్యూను పాటిస్తోంది. ఈ మేరకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటూ కరోనా వైరస్‌ను ఎదురించేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సెలెబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీయ నిర్భందంలోనూ సమయాన్ని వృథా చేయడం లేదు.

తమ ప్రతిభకు పదునుపెడుతూ సెల్ఫ్ క్వారంటైన్‌ను వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాగ శౌర్య ఆవకాయ్ పెట్టడం నేర్చుకుంటున్నాడు. అమ్మ ఉషా మూల్పూరి సాయంతో ఆవకాయ్ పెట్టడం ఎలాగో బుద్దిగా నేర్చుకుంటున్నాడు. నాగ శౌర్య రీసెంట్‌గా అశ్వథ్థామ చిత్రంతో పలకరించాడు. అయితే బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.


Click it and Unblock the Notifications











