జయసుధను ఎంతమంది రేప్ చేశారో తెలుసా? సీనియర్ నటుడు వివాదాస్పద కామెంట్

చలపతిరావు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల నటులతో ఆయన నటించి అలరించారు. సినిమాలపై పిచ్చితో మద్రాస్ రైలెక్కి, అన్న నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో అవుదామని ఇండస్టీకి వచ్చినప్పటికీ అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ , కృష్ణంరాజు తదితరులు దున్నేస్తున్న సమయమది.. దీంతో తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా టర్న్ అయ్యారు. ఏ వేషం వస్తే ఆ వేషం వేస్తూ అవకాశాలు చేజిక్కించుకున్నారు.

ఎన్టీఆర్ అండతో మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. చలపతిరావు నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం దాన వీర శూర కర్ణ . ఆ సమయంలో ఎన్టీఆర్‌కు పోటీగా కృష్ణ కురుక్షేత్రం ప్లాన్ చేశారు. ఇందుకోసం మద్రాస్‌లో ఉన్న దాదాపు తెలుగు నటులను రైల్లో రాజస్థాన్‌కు తీసుకెళ్లిపోయారు. దీంతో రామారావును నటుల కొరత వేధించింది. అందుబాటులో ఉన్న నటులతోనే పెద్దాయన దానవీర శూర కర్ణ సినిమాను తెరకెక్కించారు. ఇది చలపతిరావుకు మేలు చేసింది. ఈ మూవీలో సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు వంటి పాత్రలు పోషించడంతో ఇండస్ట్రీలో చలపతి రావు పేరు మారుమోగిపోయింది.

senior actor Chalapathi Rao made Shocking Comments on Jayasudha

తర్వాతి నుంచి మంచి క్యారెక్టర్లు రావడం మొదలైంది. వయసు పెరుగుతుండటంతో హీరో, హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్ చేస్తూ ఎంతోమందితో బాబాయ్ అనిపించుకున్నారు. ఇదే కోవలో కామెడీ విలన్‌గానూ నవ్వించారు. నటుడిగానే కాకుండా పలు చిత్రాలను నిర్మించి నిర్మాతగాను గుర్తింపు తెచ్చుకున్నారు చలపతిరావు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్లపంట , ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్థరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి సినిమా నిర్మాణాల్లో భాగస్వామిగానూ వ్యవహరించారు. చలపతిరావు కుమారుడు రవిబాబు తండ్రి బాటలోనే చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. గతేడాది అనారోగ్యంతో చలపతిరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

అయితే చలపతిరావు కెరీర్‌లో కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అనేక చిత్రాలలో విలన్‌ దగ్గర ఉండే అనుచరునిగా కనిపించారు. పలు సినిమాల్లో హీరోయిన్లను రేప్ చేసే పాత్రలు చేయడంతో అలాంటి వేషాలే చలపతిరావును పలకరించాయి. ఒకానొక దశలో ఆయన పేరు రేపుల చలపతిరావుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

ఇక 2017లో నాగచైతన్య , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన చలపతిరావు అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు భగ్గుమన్నాయి, ఆందోళనలు నిర్వహించడంతో పాటు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చలపతిరావు తాను ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆడవారు అంటే చాలా గౌరవమని, ఏనాడూ ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడలేదని అలాంటి తనను బజారున పడేశారని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఇప్పుడు బతికిలేరు కానీ చలపతిరావు మాటలు వైరల్ అవుతున్నాయి.

senior actor Chalapathi Rao made Shocking Comments on Jayasudha

జీవించి ఉన్న రోజుల్లో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న చలపతిరావు.. హీరోయిన్‌లను రేప్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జయసుధను ఎంతోమంది సినిమాల్లో రేప్ చేశారని దీనికి లెక్కే లేదు. ఎన్నో సినిమాల్లో జయసుధను రప్ చేసిన తానే ఆమెకు తండ్రిగానూ నటించానని చలపతిరావు గుర్తుచేశారు. ప్రస్తుతం పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లోను విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X