దర్శకుడిని కాల్చిపారేయండి.. ఆదిపురుష్ టీమ్‌పై శక్తిమాన్ షాకింగ్ కామెంట్స్

డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 395 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓ విధంగా ఇది పెద్ద కలెక్షన్ అని చెప్పొచ్చు. మొదటి మూడు రోజుల్లోనే మూవీ 300 కోట్ల మార్క్ ని దాటేసింది. అయితే సినిమాకి వచ్చినంత హైప్ అయితే రిలీజ్ తర్వాత కొనసాగలేదు. మూవీ తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారింది

హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా, అవమానకర రీతిలో ఆదిపురుష్ సినిమా ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆదిపురుష్ మూవీపై ఆందోళనలు చేస్తున్నాయి. అదే సమయంలో సొంత ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి సపోర్ట్ దొరకడం లేదు సెలబ్రిటీ ప్రముఖులు సైతం తీవ్ర స్థాయిలో ఆదిపురుష్ టీమ్ పై విమర్శలు చేస్తున్నారు.

Senior actor mukesh khanna shocking counter to adipurush team

ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ పై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. హనుమాన్ పాత్ర కోసం రాసిన సంభాషణలు అయితే హిందువులని అవమానించే విధంగా ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. గతంలో రామాయణం సీరియల్ లో రాముడి పాత్ర చేసిన నటుడు సైతం ఆదిపురుష్ సినిమా కథ చెప్పే విధానంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రామాయణం గురించి పూర్తిగా అధ్యయనం చేసి సినిమా తీయాల్సింది అంటూ హితవు పలికారు.

అలాగే పూర్తిగా వక్రీకరించి రామాయణం కథని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఇదిలా ఉంటే శక్తిమాన్ సీరియల్ తో అందరికి సుపరిచితం అయిన బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ అయితే ఆదిపురుష్ టీమ్ పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆదిపురుష్ టీమ్ ని అస్సలు క్షమించకూడదు. వారిని 50 డిగ్రీలకి ఉష్ణోగ్రతలో పెట్టి కాల్చేయాలి అంటూ తీవ్రం వ్యాఖ్యలు చేశారు. భారతీయ గ్రంథాలని అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించారు.

ఇప్పటికే ఆదిపురుష్ ఒక భయానక జోక్ అంటూ కొద్ది రోజుల క్రితం ముఖేష్ విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఆయన ఆదిపురుష్ టీమ్ ని కాల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ వివాదం నార్త్ ఇండియాలో అయితే ప్రస్తుతం అగ్గి రాజేసింది. ఇది ఇప్పుడు ఏ స్థాయి వరకు వెళ్తుందనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X