సూర్యకాంతం ప్రవర్తన ఎలా ఉండేదంటే? సెట్ లో అలా.. గుట్టు విప్పిన మురళి మోహన్
తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు అలనాటి నటి సూర్యకాంతం. 1950 నుంచి 1994 వరకు వరుస చిత్రాలతో అలరించింది. అలనాటి నటీమణుల్లో సూర్యాకాంతం తీరే వేరు. ఆమె నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షితులయ్యారు. గయ్యాళి పాత్రల్లో సహజంగా నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకుంది. అలనాటి నటీమణుల్లో ముక్కు మీద కోపాన్ని ప్రదర్శించిన పాత్రలకు ఆమె స్పెషలిస్ట్ గా మారింది. ఇప్పటికీ సూర్యాకాంతం సినిమాలంటే ప్రేక్షకులు ఎంతగానో వీక్షించేందుకు ఇష్టపడుతుంటారు.
ఆయా పాత్రల్లో ఆమె చూపించే నటన ప్రదర్శనకు అందరూ షాక్ అవ్వాల్సిందే. గయ్యాళి, కోపిష్టి, ఆవేశపరులు అనే పదాలకు తన పాత్రల ద్వారా అసలైన అర్థాన్ని ఇచ్చింది. నెగెటివ్ పాత్రల్లో నటించినా ఆమె చిత్రాలకు సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. సూర్యాకాంతం నటించిన చిత్రాల్లో ఎక్కువగా కుటుంబ తరహా చిత్రాలే ఉండేవి. అందులో ఆమె పాత్రలు ఎంతో వైవిధ్యంగా, ఆ నాటి అత్తలు కోడళ్లను ఎలా ఇబ్బంది పెట్టేవారో ఆమె పాత్రల ద్వారా చూపించారు. రేలంగి - సూర్యాకాంతం, రమణారెడ్డి - సూర్యాకాంతం, ఎస్వీ రంగారావు - సూర్యాకాంతం జంటలుగా ఎన్నో సినిమాలు వచ్చాయి. సూర్యాకాంతం ఉన్నదంటే ఆ సినిమాలకు మంచి మార్కెట్ కూడా ఉండేదంట.

1950 తర్వాత సూర్యాకాంతం సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, కులగోత్రాలు, దాగుడుమూతలు, అత్తగారు - కొత్త కోడలు, గుండమ్మ కథ లాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించారు. మరపురాని నట ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే ఈతరం ఆడియెన్స్ కు టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) సూర్యాకాంతం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారు. వెండితెరపై నిప్పులు కక్కే ఆవిడ.. నిజ జీవితంలో ఎలా ఉంటారనేది తాజాగా వెల్లడించారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ సూర్యకాంతం సెట్ లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారని తెలిపారు. ప్రతి ఒక్కరితో అప్యాయంగా పిలిచి పలకరించేందని, షూటింగ్ సమయంలోనూ ఒకటి రెండు టేక్స్ ఎక్ట్స్రా కావాల్సి వచ్చిన ఏమాత్రం విసుక్కునే వారు కాదని తెలియజేసింది. అయితే సూర్యాకాంతం కేవలం వెండితెరపైనే తన కోపాన్ని ప్రద్శించే వారు కానీ, సెట్ లో పెద్దలతో మర్యాదగా, చిన్నలతో ప్రేమగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆమె లాంటి నటి తెలుగు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పుకొచ్చింది. ఆమె మహానటి అని చెప్పుకొచ్చారు.
డైలాగ్ ల విషయంలో ఏకంగా ఎస్వీ రంగారావునే డామినేట్ చేసేలా పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక అత్త కోడళ్ల సీన్లు చేసిన సమయంలో షూటింగ్ తర్వాత కోడళ్ల పాత్రలో నటించిన వారి దగ్గరికి వెళ్లి సూర్యకాంతం ఏడ్చేదని చెప్పారు. నేను అలా తిట్టానని ఏమనుకోవద్దని చెప్పేవారంట. కానీ అందరూ అది కేవలం సీన్ మాత్రమే.. మీరు అలా చేయడం వల్లే సీన్ పండిందని చెప్పుకొచ్చే వారంట. ఇక సూర్యాకాంతం సెట్ లోకి వచ్చేప్పుడు కూడా ఇంటి నుంచి ఏవో ఒక తినుబంఢారాలను తీసుకొచ్చి తినిపించేందని చెప్పారు. పని విషయంలో నిక్సారైన మనిషి అని, ఆమెకు పద్మశ్రీ రావాల్సి ఉందని చెప్పారు. నేను ఆమెకు పద్మశ్రీ కోసం అప్లికేషన్ పెట్టాలని ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నించాను. కానీ కొన్ని కారణాల వల్ల కాలేదు. కానీ సూర్యకాంతంకు పద్మశ్రీ రావాలనేది నా కోరిక. కానీ ఎందుకో ఆమె ఆ గౌరవం దక్కలేదని చెప్పారు.


Click it and Unblock the Notifications











