For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిచ్చినా కొ*కా అంటూ మురళీమోహన్ సంచలనం.. అక్కినేని అలా అన్నారంటూ!

  |

  తెలుగు నటుడు మురళీమోహన్ దాదాపు అందరికీ సుపరిచితులే. హీరోగా సినీరంగంలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే సినిమాల పరంగా ఎలాంటి రిమార్క్ లేనప్పటికీ రాజకీయాల్లో ఎంటర్ కావడంతో ఆయనను ప్రత్యర్థి పార్టీలు ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన పొలిటికల్ లైఫ్ గురించి తన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  రాజకీయాల నుంచి రిటైర్

  రాజకీయాల నుంచి రిటైర్


  నటుడిగా జగమే మాయ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మురళీమోహన్ తన కెరీర్ లో దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారు.. అయితే ఇప్పుడు వయసు రీత్యా ఆయన కాస్త సినిమాల్లో కనిపించడం తగ్గించారు. అయితే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండే ఆయన ఇప్పుడు దానికి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా తన కోడలిని రాజకీయ రంగప్రవేశం చేయించారు.

  ఇసుక అమ్మేసి కోట్లు

  ఇసుక అమ్మేసి కోట్లు

  తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తన మీద ఎక్కువగా విమర్శలు వినిపించాయని అన్నారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న సమయంలో ప్రతి పక్షం వాళ్లు మురళీమోహన్ గోదావరిలో ఇసుక అమ్మేసి కోట్లు సంపాదిస్తున్నాడు అని విమర్శించారని అన్నారు.

  ఒరేయ్ పిచ్చి నా కొడకా

  ఒరేయ్ పిచ్చి నా కొడకా


  ఒరేయ్ పిచ్చి నా కొడకా మా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఇసుక కూడా బయట మార్కెట్లో కొనుక్కున్నాను అని ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని అందులో ముఖ్యంగా మందు తాగ కూడదు అని గ్యాంబ్లింగ్ ఆడకూడదని అలాగే లవ్ ఎఫైర్స్ సెకండ్ హౌస్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.

  రెండు పెగ్స్ ఫారెన్ బ్రాందీ

  రెండు పెగ్స్ ఫారెన్ బ్రాందీ

  అయితే ఒకానొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారు సాయంత్రం ఏమి పుచ్చుకుంటారని అడిగితే ఏమి పుచ్చుకోనని అని చెప్పానని వివరించారు. అయితే 60 ఏళ్లు దాటాక నరాలు దెబ్బతింటాయని అప్పుడు మనిషి యాక్టివ్ కావాలంటే రోజు రెండు పెగ్స్ ఫారెన్ బ్రాందీ తాగాలని ఆయన చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని మురళీ మోహన్ పశ్చాత్తాప పడ్డారు.

  రాజకీయాలంటే విరక్తి

  రాజకీయాలంటే విరక్తి

  తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమేనని పేర్కొన్న ఆయన తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్విన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకు వచ్చారని అన్నారు. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న ఆయన రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారని కామెంట్స్ కూడా చేశారు. మరి రాబోతున్న పూర్తి ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Senior Actor Murali Mohan sensational interview is going to be aired in a popular telugu news channel. he made some intresing comments on politics and cinema life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X