ఆ విషయంలో సీనియర్ నటుడు నరేష్ సీరియస్.. మరోసారి పోలీసులకు పిర్యాదు

సీనియర్ నటుడు నరేష్ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. గత కొంతకాలంగా నరేష్ పవిత్ర లోకేష్ కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఆయన మూడో భార్యకు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన నరేష్ ఆ తర్వాత ఆమె నుంచి విడిపోతున్నట్లు కూడా క్లారిటీగా తెలియజేశాడు.

త్వరలోనే విడాకులు కూడా తీసుకుపోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక ఆ విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక నరేష్ మరోసారి పోలీసులను ఆశ్రయించి సోషల్ మీడియాలో కొంతమంది తప్పుగా తనపై తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. మొన్నటి వరకు సినిమా షూటింగులతో బిజీగా ఉన్న నరేష్ శుక్రవారం రోజు హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చారు.

Senior actor naresh filing a complaint at hyderabad cyber crime office regarding fake news

నటి పవిత్ర తో తనకు ఉన్న రిలేషన్ గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ట్రోలింగ్ కూడా ఎక్కువైందని ఇక ఇది వరకే కొంతమంది పై ఫిర్యాదు చేసిన నరేష్ ఆ విషయాల గురించి కూడా పోలీసులతో చర్చించినట్లు సమాచారం. కావాలని ఈ విధంగా తనపై తప్పుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు అని అలాగే మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నట్లుగా ఆయన పోలీసులకు తెలియజేశారు.

గత ఏడాది నవంబర్ 27వ తేదీన మొదట నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. పలు వెబ్ సైట్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ పై కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 15 యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్స్ కు ఇదివరకే నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ట్రోల్స్ పై కూడా ఆయన సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయించారు. ఇక కొన్ని వారాల క్రితం నరేష్ తన మాజీ భార్య రమ్య రఘుపతి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది అని తనపై దాడి చేసేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన కొన్ని వీడియోలు విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X