మణిరత్నం మూవీలో మరో ప్రముఖ నటుడు.. ఐశ్వర్యరాయ్, విక్రమ్ తర్వాత..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో క్రేజీ హీరో, హీరోయిన్లు, సీనియర్ నటులు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, విక్రమ్ లాంటి ప్రాజెక్టులో చేరిపోగా, తాజాగా అలనాటి హీరో, సీనియర్ నటుడు పార్తీపన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. స్వయంగా పార్తీపన్ ట్వీట్ చేసి సమాచారాన్ని అందించారు.
పొన్నియన్ సెల్వమ్ సినిమా గురించి పార్తీపన్ ట్వీట్ చేస్తూ మణిరత్నంతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం స్క్రిప్టు అద్భుతంగా వస్తుందని పేర్కొన్నారు. రాజ రాజ చోళ చక్రవర్తి జీవిత కథ ఆధారంగా, ప్రముఖ రచయిత అమర కల్కి రాసిన పుస్తకంగా ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. గత కొద్దికాలంగా ఈ ప్రాజెక్ట్‌పై కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్, విజయ్ సేతుపతి, విక్రమ్, కార్తీ, జయమ్ రవి, కీర్తీ సురేష్ లాంటి పేర్లు వినిపించాయి. అయితే మణిరత్నం యూనిట్ అధికారికంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను ఇంకా వెల్లడించలేదు.విజయ్ సేతుపతి రాక కోసం యూనిట్ వేచి చేస్తున్నది. అతడు రాగానే ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అని తమిళ పత్రికలు కథనాన్ని వెల్లడించాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్నది. గతంలో మణిరత్నం రూపొందించిన నవాబ్ సినిమాను కూడా ఈ నిర్మాణ సంస్థే తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











