ఆత్మహత్యకు సిద్దపడ్డా.. ఇళయరాజా బతికించాడు.. రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 45 ఏళ్లుగా ఆయన వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను, తన అభిమానులను అలరిస్తున్నారు. కాగా ఇటీవల రాజేంద్ర ప్రసాద్ తన స్పీచ్ లతో వార్తల్లో నిలుస్తున్నారు. కాంట్రవర్సీయల్ మాటలతో అందరి దృష్టి తనపై పడేలా చేస్తున్నారు.
ఆ మధ్యన రాజేంద్ర ప్రసాద్ నటించిన 'రాబిన్ హుడ్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నితిన్ - శ్రీలీలా జంటగా నటించిన ఆ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఆ మూవీలో స్పెషల్ ఫోర్స్ పోలీసు ఆఫీసర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పచ్చి బూతులు మాట్లాడిని అందరిని షాక్ కు గురి చేశారు.

తర్వాత రియలైజ్ అయిన రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ అభిమానులకు, క్రికెట్ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా మరో సినిమా ప్రెస్ మీట్ లో షాకింగ్ కామెంట్లు చేశారు. తన గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గ్గా మారింది. ఆయన కెరీయర్ లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఒక సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్ కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కలిగిందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
రాజేంద్ర ప్రసాద్ తాజాగా నటించిన చిత్రం 'షష్ఠిపూర్తి'. ఈ సినిమాకు పవన్ ప్రభు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి అర్చన మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ సరసన నటించి కంబ్యాక్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ - అర్చన కలిసి 1986లో లేడీస్ టైలర్ అనే సినిమాలో నటించి హిట్ అందుకున్నారు. ఇక ఈ ఫ్యామిలీ డ్రామాకు లెజెండ్, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.
తన కెరీయర్ లో ఎన్నో సినిమాలు చేశానని, కానీ ప్రేమించు పెళ్లాడు అనే చిత్రం తర్వాత ఆర్థిక పరిస్థితులు బలహీన పడ్డాయని చెప్పుకొచ్చారు. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. డబ్బింగ్ తో చెప్పిన డబ్బులతోనైనా చెన్నైలో ఇల్లు కట్టానని, కానీ హీరోగా మాత్రం చేసిన ఆ సినిమాతో పరిస్థితి మారిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లేడీస్ టైలర్ సినిమాతో బతికిపోయానని లేదంటే దండేసి దండం పెట్టేవారని వ్యాఖ్యానించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ నుంచి ఇలాంటి స్పీచ్ రావడంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఆయన మాటలు కూడా వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











