ఆరోగ్యంపై వస్తున్న రూమర్లపై స్వయంగా స్పందించిన చంద్రమోహన్.. ఇదే అసలు నిజం!
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటుడు చంద్రమోహన్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. సహా నటుడిగా, హీరోగా, ఫాదర్ గా ఎన్నో సినిమాల్లో కనిపించిన ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై ఇటీవల అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతుండడంతో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందారు. దీంతో చంద్రమోహన్ స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

1966 నుంచి..
BN రెడ్డి దర్శకత్వంలో 1966లో వచ్చిన రంగుల రాట్నం అనే సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ 2017 వరకు పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలను చేసుకుంటూ వచ్చారు. మూడు తరాల జనరేషన్స్ వర్క్ చేసిన అతికొద్ది మంది మంచి నటులలో చంద్రమోహన్ ఒకరు.

50ఏళ్ళ సినిమా కెరీర్..
50ఏళ్ళ సినిమా కెరీర్ లో ఆయన వందల సంఖ్యలో సినిమాల్లో నటించి టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 76. చివరగా గోపిచంద్ ఆక్సిజన్ సినిమాలో కనిపించిన చంద్రమోహన్ మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. అవకశాలు వచ్చినా కూడా పాత్రలు నచ్చక పెద్దగా నటించాలని అనుకోలేదు.

వీడియో రిలీజ్ చేసిన చంద్రమోహన్
అయితే ఆయన సినిమాల్లో కనిపించకపోవడంతో గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే తమిళ మీడియాలో కూడా వార్తలు రావడంతో విషయం తెలుసుకున్న చంద్రమోహన్ స్వయంగా తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం అంతా బాగానే ఉందని అభిమానులకు ఆత్మీయులకు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
Recommended Video
ఫేక్ న్యూస్.. నమ్మకండి
మే 23న చంద్రమోహన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియోలో ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం గురించి ఈ మధ్య ఫేక్ న్యూస్ లు వచ్చాయి. నాకు బాగాలేదని వస్తున్న వార్తలు నిజం కాదు. నమ్మకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అభిమానానికి ఆశీస్సులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. అని చంద్రమోహన్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications