బ్లూ** కేసులో ఇరికించి.. నా కారులో ఆ అమ్మాయితో, 30 ఏళ్ల తర్వాత రహస్యం బయటపెట్టిన సుమన్
తెలుగునాట విలక్షణ నటుడిగా, యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. బంగారు వర్ణంలో మెరిసిపోయే సుమన్‌ను చూసి ఆ రోజుల్లో అమ్మాయిలంతా అలాంటి అందమైన కుర్రాడే తమకు భర్తగా రావాలని కోరుకున్నారంటూ అతిశయోక్తి కాదు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 4 నాలుగు దశాబ్ధాలుగా తనదైన నటనతో అలరిస్తున్నారు . కానీ ఆయన జీవితంలో నీలి చిత్రాల కేసు ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది.
1959 ఆగస్ట్ 29న చెన్నైలోని జన్మించిన సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్. తల్లిదండ్రులు కేసరి చంద్ర, సుశీల్ చంద్ర. ఇంగ్లీష్ లీటరేచర్‌లో బీఏ చేసిన సుమన్.. అనంతరం సంగీతం నేర్చుకున్నారు. సినిమాలపై ఆసక్తితో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన తన రూపం, ఒడ్డు పొడుగుతో చాలా సులభంగానే హీరోగా అవకాశాలు అందుకున్నారు. 1978లో కరునై ఉల్లం అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన సుమన్ కోలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్నారు.

ఈ క్రమంలో 1982లో ఇద్దరు కిలాడీలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు. ఆ వెంటనే తరంగిణి, అపరాధి, నేటి భారతం, నవోదయం, కోడలు కావాలి, కళ్యాణ వీణ, త్రివేణి సంగమం, మెరుపుదాడి, పన్నెండు సూత్రాలు, రారాజు, సితార, న్యాయం మీరే చెప్పాలి, అమెరికా అల్లుడు, దర్జా దొంగ, కంచు కవచం, ధర్మపత్ని, పెద్దింటి అల్లుడు, కలెక్టర్ గారి అల్లుడు, ఖైదీ ఇన్స్‌పెక్టర్, బావ బావమరిది, వంటి హిట్ చిత్రాలతో తెలుగు నాట తిరుగులేని స్టార్ అయ్యారు. మాస్, క్లాస్ ఫాలోయింగ్‌తో పాటు సుమన్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించేవి. సీనియర్ రైటర్ డీవీ . నరసరాజు కుమార్తె శిరీషను పెళ్లాడిన సుమన్‌కు కుమార్తె ప్రత్యూష ఉన్నారు.
అయితే సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న సుమన్ కెరీర్‌లో నీలి చిత్రాల కేసు ఓ మచ్చలో మారిపోయింది. ఇది ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. సుమన్ స్టార్‌డమ్‌ని చూసి తట్టుకోలేక కొందరు సినిమా వాళ్లే ఆయనను ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని సుమన్ అభిమానులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో అవి రూమర్స్‌గా మిగిలిపోయాయి. కానీ సుమన్ కెరీర్‌కు ఎంత నష్టం చేకూర్చాలో అంత చేశాయి.
స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న దశలో ఈ కేసు తర్వాత సుమన్ చిన్నా చితకా పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి దశలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెరపై ఆయన కనిపించగానే నిజంగానే వెంకటేశ్వర స్వామి వచ్చాడా అన్నట్లుగా భక్తులు హారతులు పట్టేవారంటే అతిశయోక్తి కాదు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే శ్రీరామదాసులో శ్రీరాముడిగానూ నటించి సరికొత్త ట్రెంట్ సెట్ చేశారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీలో విలన్‌గా క్రూరంగానూ కనిపించారు.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. నీలి చిత్రాల కేసు గురించి కీలక విషయాలు పంచుకున్నారు. తనకు దివాకర్ అనే మిత్రుడు ఉండేవాడని అతను తమిళనాడులోనే ఓ బిగ్‌షూట్ కూతురిని ప్రేమించాడని తెలిపారు. అతను ఏదైనా పని ఉంటే నా కారు తీసుకుని వాడుకుంటాడని .. ఈ క్రమంలోనే ఆ పెద్దింటి అమ్మాయిని తీసుకుని నా కారులోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాడని సుమన్ చెప్పారు. వాళ్లిద్దరూ నా కారులో వెళ్తుండగా ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి చూడటంతో దీని వెనుక నా హస్తం కూడా ఉందని అనుకున్నారని సుమన్ తెలిపారు. ఆ తర్వాతే తాను కేసులో ఇరుక్కోవడం, ఇతర పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











