అమెరికా పెళ్లిలో రామ్ చరణ్, వెంకటేష్ సందడి.. స్టేజీపైనే ఆ మాట అనేసిన వెంకీ మామ!
మెగా పవర్ స్టార్ గా మెగా అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు తెలుగు చిత్రసీమలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. దర్శక దిగ్గజం రాజమౌళి అకా జక్కన్న తెరకెక్కించిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్ అయిపోయాడు.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనపై తెలుగు ప్రేక్షకులు, సినీ విమర్శకులే కాకుండా విదేశీయులు సైతం కొనియాడుతున్నారు. ఇటీవల HCA అవార్డ్సుకు ప్రజంటర్ గా చేసిన రామ్ చరణ్.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ తో అమెరికాలోని ఏ పెళ్లిలో సందడి చేశారు.

నాటు నాటు సాంగ్ కి..
తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాకు అంతర్జాతియ స్థాయిలో ఫేమ్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఇప్పటికే అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ చిత్రం గ్లోబల్ గా సత్తా చాటుతోంది. తెలుగు సినిమా చిరకాల కోరిక అయిన ఆస్కార్ కోసం నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డుల నామినేషన్స్ బరిలోకి దిగింది. ఈ పాటకు గానూ ఆస్కార్ రావడం ఖాయం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

స్టార్ హీరోల నటనకు..
ఇదిలా ఉంటే రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, దర్శకుడు రాజమౌళి టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం, పాటలు, కొరియోగ్రఫీ, యాక్షన్ స్టంట్స్ అన్నింట్లో మార్కులు కొట్టేసింది RRR మూవీ.
అంతేకాకుండా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హావాభావాలు, ఎమోషన్స్ కు యావత్ ప్రపంచమే ఫిదా అయి ప్రశంసల జల్లులు కురిపిస్తోది.

ఏకంగా 5 కేటగిరీల్లో..
RRRలోని నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని చిత్ర యూనిట్ తో పాటు కోట్లాది భారతీయులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ వేడుకల కంటే ముందుగానే చిత్రబృందం అమెరికా వెళ్లింది. ఇందులో భాగంగానే హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డ్స్ ప్రదానోత్సవంలో పాల్గొంది RRR టీమ్. ఈ అవార్డ్సులో ఏకంగా 5 ఐదు విభాగాల్లో RRR సినిమా నామినేట్ కావడం విశేషం.

నా పక్కనే ఉండటం..
ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో RRR సినిమా అవార్డులను గెలిచింది. అంతేకాకుండా ఈ అవార్డ్సులో తన పక్కనే ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లుగా హాలీవుడ్ నటి చెప్పడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఓ పెళ్లికి అతిథిగా..
అంతేకాకుండా HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ కి ప్రజంటర్ గా హాజరు అయిన రామ్ చరణ్.. బెస్ట్ వాయిస్, మోషన్ క్యాప్చర్ పెర్ఫామెన్స్ అవార్డులను అనౌన్స్ చేశాడు. దీంతో ఇలా ప్రజెంటర్ గా చేసిన తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే ఈ అవార్డ్స్ తర్వాత అమెరికాలో జరిగిన ఓ పెళ్లికి అతిథిగా హాజరయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అతనితోపాటు ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష కూడా పాల్గొని సందడి చేశాడు.
ఇట్స్ నాటు నాటు చరణ్..
అమెరికాలో జరిగిన ఓ వివాహపు వేడుకలో వెంకటేష్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి సందడి చేశారు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ అందుకున్నందుకు గానూ వేదికపైనే రామ్ చరణ్ కు కంగ్రాట్స్ తెలిపారు వెంకటేష్. ఈ సందర్భంగా నాటు నాటు అని వెంకీ పేరు ఎత్తగానే అతిథులుందరూ హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. "ఇట్స్ నాటు నాటు చరణ్" అని అన్న వెంకీ మామా "అన్ని అవార్డ్స్ చరణ్ కే" అని చెప్పారు. దీంతో థ్యాంక్యూ సోమచ్ వెంకీ అన్నా అని చెర్రీ తెలిపాడు.


Click it and Unblock the Notifications











